AP Assembly MLA Seats: ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపుపై డిప్యూటీ స్పీకర్ ప్రకటన
ABN , Publish Date - Mar 03 , 2025 | 01:33 PM
AP Assembly MLA Seats: ఏపీ శాసనసభలో ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయిస్తూ డిప్యూటీ స్పీకర్ రఘురామ ప్రకటన చేశారు. ట్రెజరీ బెంచ్‌గా ముందు వరుసలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులకు సీట్ల కేటాయింపులు జరిగాయి.

అమరావతి, మార్చి 3: ఏపీ శాసనసభలో (AP Legislative Assembly) ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయించారు. ఈ మేరకు సోమవారం సభలో సీట్ల కేటాయింపుపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు (Deputy Speaker Raghurama Krishnam Raju) ప్రకటన చేశారు. ట్రెజరీ బెంచ్‌గా ముందు వరుసలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులకు సీట్లు కేటాయించారు. అనంతరం చీఫ్ విప్, విప్ లకు సీట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆపై సీనియారిటీ ప్రాతిపదికన ఎమ్మెల్యేలకు సీట్లను (AP MLAs Seats) కేటాయించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు (AP CM Chandrababu Naidu) 1 నెంబరు సీట్ కేటాయించగా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు (Deputy CM Pawan Kalyan) 39 నెంబరు సీట్‌ను నిర్ణయించారు. ఇక మాజీ ముఖ్యమంత్రిగా, వైసీపీ శాసనసభా పక్షనేతగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YSRCP Chief YS Jagan Mohan Reddy) ప్రతిపక్ష బెంచ్‌లో ముందు వరుస సీట్ కేటాయించారు.
కాగా.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘోర ఓటమిని చవిచూసింది. కేవలం 11 సీట్లకు మాత్రమే ఫ్యాన్ పార్టీ పరిమితమైంది. అయితే పదకొండు సీట్లు వచ్చినప్పటికీ తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఆ పార్టీ పోరాడుతూనే ఉంది. ప్రతిపక్ష హోదా ఇస్తానే అసెంబ్లీకి వస్తామని లేదంటే రామని వైసీపీ నేతలు చెబుతున్నారు. అలాగే జగన్ కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చేదాకా అసెంబ్లీ మొహం చూసేది లేదని అన్నారు. కానీ.. యూటర్న్ తీసుకున్న ఇప్పుడు జరుగుతున్న సమావేశాలకు కేవలం అటెండెన్స్ కోసమే సమావేశాలకు వచ్చారు. అది కూడా తొలిరోజు గవర్నర్ ప్రసంగం రోజున మాత్రమే జగన్ అసెంబ్లీకి వచ్చి కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే ఉన్నారు. ప్రతిపక్ష ఇవ్వనందున బాయ్‌కాట్ చేస్తున్నామంటూ సభ నుంచి వెళ్లిపోయారు జగన్. ఈ క్రమంలో శాసనసభలో సీట్ల విషయంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ తీసుకున్న నిర్ణయం జగన్‌కు గుడ్‌న్యూస్ అనే చెప్పుకోవచ్చు. జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పటికీ ఆయన కూర్చునే సీటు మాత్రం ప్రతిపక్ష బెంచ్ ముందు వరుసలోనే కేటాయించారు. దీంతో ఇకపై సమావేశాలు ఎప్పుడు జరిగినా ఎవరికి కేటాయించిన సీట్లలోనే వారు కూర్చోవాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి...
Case on Posani Murali Krishna: పోసానిపై కేసు.. రాజంపేటకు నరసారావుపేట పోలీసులు
Toddy Cat spotted: కృష్ణా జిల్లాలో అరుదైన జాతి పునుగుపిల్లి
Read Latest AP News And Telugu News