Share News

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత

ABN , Publish Date - Mar 26 , 2025 | 10:48 AM

వైసీపీ కీలక నేత కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారనే వార్త తెలియగానే వైసీపీ నేతలు ఆయనను పరామర్శించేందుకు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేందుకు ఒక్కొక్కరుగా ఆసుపత్రికి వస్తున్నారు.

 Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత
Kodali Nani

హైదరాబాద్: వైసీపీ కీలక నేత (YCP key leader), మాజీ మంత్రి కొడాలి నాని (Ex Minister Kodali Nani) అస్వస్థతకు (Health Issues) గురయ్యారు. దీంతో ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో (AIG Hospital) చేరారు. గత రాత్రి (మంగళవారం) ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తడంతో ఆస్పత్రిలో చేరారు. అయితే ఆయనకు గుండె సంబంధిత సమస్య ఉందని గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే వైద్యులు కొన్ని పరీక్షలు పూర్తి చేశారు. బుధవారం మధ్యాహ్నం తర్వాత కొడాలి నాని ఆరోగ్య పరిస్థితికి సంబంధించి డాక్లర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశముంది. గత రెండు రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మరోవైపు కిడ్నీ సమస్య ఉన్నట్లు సమాచారం.

Also Read..: రుయా సెంట్రల్ ల్యాబ్‌లో లైంగిక వేధింపులు


ప్రస్తుతం కొడాలి నానికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారనే వార్త తెలియగానే వైసీపీ నేతలు ఆయనను పరామర్శించేందుకు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేందుకు ఒక్కొక్కరుగా ఏఐజీ ఆసుపత్రికి వస్తున్నారు. ఇక గుడివాడ నియోజవర్గ పరిధిలో నాని అభిమానులు, అనుచరులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


కాగా రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోవడంతో కొన్నాళ్లుగా కొడాలి నాని పొలిటికల్‌గా యాక్టివ్‌గా లేరు. పార్టీ కార్యక్రమాలకు ముందుడే ఆయన.. సరిగా కనిపించడంలేదు. ఇక సోషల్ మీడియాలో ఆయన అనారోగ్య కారణలతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు హార్ట్ఎటాక్ (Heart Attack) రావడం అటు పార్టీ శ్రేణుల్లో.. ఇటు కుటుంబ సభ్యుల్లోనూ ఆందోళన నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ మద్యం స్కాంపై అమిత్ షా ఆరా

ప్రేమలో ఉన్నవారు ఈ తప్పులు చేయొద్దు..

పాపవినాశనంలో బోటింగ్‌పై వివాదం..

For More AP News and Telugu News

Updated Date - Mar 26 , 2025 | 10:58 AM