Share News

Vamshi Case: మళ్లీ సమయం కోరిన పోలీసులు.. వంశీ న్యాయవాదుల అభ్యంతరం

ABN , Publish Date - Feb 21 , 2025 | 12:26 PM

Vamshi Case: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో పోలీసుల తీరుపై వంశీ న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. ఈరోజు కోర్టులో వాదనలు జరుగుతుండగా.. కౌంటర్‌కు సమయం కావాలని మరోసారి కోర్టును కోరారు పోలీసులు.

Vamshi Case: మళ్లీ సమయం కోరిన పోలీసులు.. వంశీ న్యాయవాదుల అభ్యంతరం
Vallabhaneni Vamshi Case

విజయవాడ, ఫిబ్రవరి 21: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Former MLA Vallabhaneni Vamshi) బెయిల్ పిటిషన్‌‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం కోరారు. కౌంటర్ దాఖలు చేయడానికి మూడు రోజుల సమయం కావాలని కోర్టుకు వినతి చేశారు. ఇప్పటికే రెండు సార్లు పోలీసుల విజ్ఞప్తితో న్యాయస్థానం సమయం ఇచ్చింది. మరోసారి పోలీసులు సమయం కోరడంపై వంశీ తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వంశీ బెయిల్ పిటిషన్‌కు సంబంధించి పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వంశీకి బెయిల్ ఇవ్వాలంటూ అతని తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు.


సత్యవర్ధన్ కిడ్నాప్‌ వ్యవహారంలో వంశీ నేరుగా పాల్గొనలేదని, కుట్ర పూరితంగా ఇరికించారని వాదనలు వినిపించారు. ఆరోగ్య కారణాలను కూడా పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయాలని వంశీ తరపు న్యాయవాదులు వాదించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా మూడు రోజుల క్రితమే న్యాయమూర్తి ఆదేశించారు. అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై వంశీ తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈరోజు కౌంటర్ దాఖలు చేస్తారని భావించగా.. మరో మూడు రోజుల పాటు సమయం కోరుతూ పోలీసులు మరో పిటిషన్ వేశారు. దీనిపై వంశీ న్యాయవాదులు తీవ్ర అబ్జెక్షన్ చేశారు. పోలీసుల పిటిషన్‌పై న్యాయమూర్తి నిర్ణయం ఎలా ఉండబోతుందో మరికాసేపట్లో తెలియనుంది.

Social Media: ఉపముఖ్యమంత్రిపై అనుచిత పోస్ట్.. కేసు నమోదు


వంశీ కేసుకు సంబంధించి విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. ప్రధానంగా పోలీసులు పదిరోజుల పాటు వంశీని కస్టడీకి ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశారు. వంశీని కస్టడీకి ఇస్తే మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని, మరికొంత మంది పాత్రలపై అనుమానం వ్యక్తం చేస్తున్న తరుణంలో వంశీ ఇచ్చే సమచారం కీలకంగా మారనుందని అందువల్ల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. దీనిపై రెండు రోజుల పాటు వాదనలు జరిగాయి.


అలాగే జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీకి ఆరోగ్య రీత్యా మంచం ఏర్పాటు చేయడంతో పాటు ఇంటి నుంచి భోజన సదుపాయం కల్పించాలని పిటిషన్‌ దాఖలు చేశారు. గత రెండు రోజులుగా ఈ పిటిషన్లపై ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. జైలు సూపరింటెండెంట్, ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నుంచి నివేదిక వచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం వెలువరిస్తామని కోర్టు తెలిపింది. దీంతో ఇరువురి నుంచి నివేదిక కోర్టుకు అందినట్లు తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో దానికి సంబంధించి న్యాయమూర్తి తీర్పు వెలువరించే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి...

తాజ్‌ బంజారా హోటల్‌‌కు షాక్

Phone Tapping Case: ఫోన్‌ట్యాపింగ్ కేసు.. వంశీ కృష్ణ సంచలన వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 21 , 2025 | 12:26 PM