Share News

Lokesh support Headmaster: స్కూల్‌లో గుంజీలు తీసిన హెడ్‌మాస్టర్.. ఏమైందంటే..

ABN , Publish Date - Mar 13 , 2025 | 03:18 PM

Lokesh support Headmaster: మాట వినడం లేదంటూ విద్యార్థుల విషయంలో ఓ హెడ్మాస్టర్ చేసిన పనిని అభినందించారు మంత్రి లోకేష్. మీ ఆలోచన బాగుంది.. అంతా కలిసి పనిచేద్దామంటూ పిలుపునిచ్చారు మంత్రి.

Lokesh support Headmaster: స్కూల్‌లో గుంజీలు తీసిన హెడ్‌మాస్టర్.. ఏమైందంటే..
Lokesh support Headmaster

అమరావతి, మార్చి 13: స్కూల్లో పిల్లలు తప్పు చేస్తే టీచర్లు మందలించడం కామన్. ఒక్కోసారి అల్లరి శృతిమించినా, చదవకపోయినా దండిస్తారు కూడా. కానీ విజయనగరంలో ఓ హెడ్మాస్టర్‌ మాత్రం వెరైటీగా ఆలోచించారు. చెప్పిన మాట వినని పిల్లల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఆయన చేసిన పని ఏకంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ (Minister lokesh) దృష్టికి వెళ్లింది. హెడ్మాస్టర్ ఆలోచనకు మంత్రి కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన లోకేష్.. అంతాకలిసి పనిచేద్దామంటూ ప్రధానోపాధ్యాయుడికి సందేశమిచ్చారు. ఇంతకీ హెడ్మాస్టర్ ఏం చేశారు.. లోకేష్ ఏమని అభినందించారో ఇప్పుడు చూద్దాం.


పిల్లల ముందే ఓ హెడ్మాస్టర్ గుంజీలు తీశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జెడ్పీ హైస్కూల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పిల్ల‌ల విద్యా పురోగ‌తి అంతంత‌ మాత్రంగా ఉంద‌ని, చెప్పిన మాట విన‌డంలేదంటూ వారిని దండించలేదు హెడ్మాస్టర్ చింత రమణ. పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు సరికొత్త ఆలోచనకు నాంది పలికారు. స్కూల్ పిల్లలందరినీ ఒక్క దగ్గర చేర్చి వారి ముందు తనను తాను శిక్షించుకున్నారు. ఆ విద్యార్థుల ముందే గుంజీలు తీశారు హెడ్మాస్టర్. ప్రస్తుతం హెడ్మాస్టర్ గుంజీలు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై మంత్రి లోకేష్‌ స్పందించారు.

Raja Singh Targets BJP Leaders: వారిని తరమిస్తేనే.. పార్టీకి మంచి రోజులు.. రాజాసింగ్ సంచలన కామెంట్స్


లోకేష్ ట్వీట్ ఇదే..

‘విజ‌య‌న‌గ‌రం జిల్లా బొబ్బిలి మండ‌లం పెంట జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్ట‌ర్ చింత ర‌మ‌ణ పిల్ల‌ల విద్యా పురోగ‌తి అంతంత‌మాత్రంగా ఉంద‌ని, చెప్పిన మాట విన‌డంలేద‌ని విద్యార్థుల‌ను దండించ‌కుండా, గుంజీలు తీసిన‌ వీడియో సోష‌ల్ మీడియా ద్వారా నా దృష్టికి వ‌చ్చింది. హెడ్మాస్ట‌రు గారూ! అంతా క‌లిసి ప‌నిచేసి, ప్రోత్సాహం అందిస్తే మ‌న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ పిల్ల‌లు అద్భుతాలు సృష్టిస్తారు. వారిని దండించ‌కుండా అర్థం చేసుకునేలా మీ స్వీయ‌ క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌ ఆలోచ‌న బాగుంది, అభినంద‌న‌లు. అందరం క‌లిసి విద్యా ప్ర‌మాణాలు పెంచుదాం. పిల్ల‌ల విద్య‌, శారీర‌క‌, మాన‌సిక వికాసానికి కృషి చేసి, వారి బంగారు భ‌విష్య‌త్తుకు బాట‌లు వేద్దాం’ అంటూ మంత్రి లోకేష్ ఎక్స్‌ వేదికగా తెలియజేశారు.


ఇవి కూడా చదవండి...

Congress vs BRS: ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్

CM Chandrababu: విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీనే

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 13 , 2025 | 07:06 PM