Robbery: హైటెక్ చోరీ.. ఖంగుతిన్న పోలీసులు
ABN , Publish Date - Feb 20 , 2025 | 10:04 AM
Andhrapradesh: ఎన్టీఆర్ జిల్లాలోని ఓ ఇంట్లో జరిగిన చోరీ పోలీసులనే ఖంగుతినేలా చేసింది. ఆ ఇంట్లో దొంగతనం చేసే సమయంలో దొంగల ప్రవర్తించిన తీరుపై ఆశ్చర్యపోయారు పోలీసులు.

ఎన్టీఆర్ జిల్లా, ఫిబ్రవరి 20: ఎంత పెద్ద దొంగ అయినా దొంగతనం (Robbery) చేసినప్పుడు ఏదో ఒక క్లూ వదిలి వెళ్లడం కామన్. ఆ క్లూ ఆధారంగానే పోలీసులు వారిని వెతికి మరీ పట్టుకుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే దొంగలు మాత్రం పోలీసులే ఖంగుతినేలా చేశారు. పక్కా ప్లాన్‌తో వారు దొంగతనం చేసిన తీరు చూసి పోలీసులు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. ఇంతకీ ఆ దొంగలు ఏ విధంగా దొంగతనానికి పాల్పడ్డారు.. దొంగతనం చేసే సమయంలో వారు చేసి పని ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఏం జరిగిందంటే...
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణం విష్ణుప్రియ నగర్‌లో హైటెక్ చోరీ జరిగింది. ఓ ఇంట్లో దొంగతనానికి వచ్చిన దుండగుల పక్కా ప్రణాళికతో ఆధారాలు దొరక్కుండా చేశారు. దొంగతనం చేయడంతో పాటు.. ఆధారాలు పోలీసులకు చిక్కకుండా సీసీ కెమెరా ఫుటేజ్ హార్డ్ డిస్క్‌లను కూడా ఎత్తుకెళ్లారు టక్కరి దొంగలు. వీరి అతితెలివికి పోలీసులు కూడా ఖంగుతిన్న పరిస్థితి. విష్ణు ప్రియనగర్‌కు చెందిన ఇంటి యజమాని డాక్యుమెంట్ రైటర్ ప్రసాద్ కుటుంబ సభ్యులు.. మంగళవారం ఉదయం మహాకుంభమేళాకు బయలుదేరి వెళ్లారు. అయితే మంగళవారం అర్ధారాత్రే యాజమాని సెల్‌ఫోన్‌కు సీసీ కెమెరాల దృశ్యాలు కట్ అయ్యాయి. అనుమానం వచ్చిన సదరు యజమని బుధవారం తెల్లవారుజామున ఇంటి పక్కన వారిని చూడాల్సిందిగా పురమాయించాడు. వెంటనే వారు వెళ్లి చూడగా యజమాని ఇంట్లో దొంగతం జరిగినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే ఇంటి యజమాని ప్రసాద్‌కు సమాచారం అందించారు పక్కంటి వాళ్లు. దీంతో దొంగతనంపై జగ్గయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అగంతకులు సీసీ కెమెరాల వైర్ కట్ చేసి, సమీప సీసీ కెమెరాలో కనిపించకుండా సీసీ కెమెరాల దిక్కు మార్చిన వైనం పోలీసులను కూడా ఆశ్చర్యపోయేలా చేసింది. ఇంట్లో ఉన్న నగలు, బంగారాన్ని దోచుకున్న దుండగులు.. అంతటితో ఆగకుండా ఇంటి లోపల కూడా వైఫై సీసీ కెమెరా, ఎన్వీఆర్ సిస్టమ్‌ను కూడా పట్టుకుపోయారు. యజమాని ఫిర్యాదు మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయవాడ నుంచి వచ్చిన క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించే పనిలో పడింది. ఇంట్లో దాదాపు 162 గ్రాముల బంగారం వస్తువులు పోయినట్లు యజమాని చెబుతున్నాడు. చోరీ జరిగిన తీరును నేర పరిశోధన విభాగ డీసీపీ కేంకటేశ్వర్లు, నందిగామ ఎసీపీ తిలక్, సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ ఐ1 రాజు, ఎస్ ఐ వెంకటేశ్వరరావు, పోలిస్ టీమ్ సభ్యులు జాలయ్య, లక్ష్మి నారాయణ, భాను పరిశీలించారు. త్వరలో దొంగను పట్టుకుంటామని, గృహస్తులు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని సహకరించాలని ఎసీపీ తిలక్ విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి...
East Godavari: రహస్య ప్రాంతంలో కోడి పందేలు.. ఎంటరైన పోలీసులు.. చివరికి..
Read Latest AP News And Telugu News