Share News

CM Chandrababu: ఆ నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్

ABN , Publish Date - Feb 03 , 2025 | 09:30 AM

CM Chandrababu: భారత్‌లో భారీ పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు వస్తున్నారని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరించబోతోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయన్నారు.

CM Chandrababu: ఆ నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్
CM Chandrababu Naidu

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: భారత్‌ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏఐ సాంకేతికతలో భారత్‌ (India) ముందు వరుసలో ఉందన్నారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్‌ ఉందని అన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్‌ పేరు మారుమోగుతోందని తెలిపారు. ఫుడ్‌ సెక్యూరిటీకి గ్లోబల్‌ హబ్‌గా భారత్‌ మారబోతోందని వెల్లడించారు. ఎమ్ఎస్‌ఎమ్‌ఈ పాలసీకి గేమ్‌ఛేంజర్‌గా భారత్‌ మారనుందని పేర్కొన్నారు. భారత్‌లో భారీ పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు వస్తున్నారని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరించబోతోందని అన్నారు.


మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారని తెలిపారు. పవర్‌, ఇన్సూరెన్స్‌, మైనింగ్‌ సహా పలు రంగాల్లో సంస్కరణలు తీసుకువచ్చామని. పలు రంగాల్లో భారీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఏపీలోనే తొలిసారి విద్యుత్‌ రంగం సంస్కరణలు తీసువచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు.


కమ్యూనిజం పోయి.. టూరిజం మిగిలింది..

ఈ బడ్జెట్ సమ్మిళిత అభివృద్ధికి దోహదం చేస్తుందని.. అన్నదాత, యువత, మహిళలు ఈ బడ్జెట్ ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందనున్నారని తెలిపారు. వ్యవసాయ రంగంపై ఇప్పటికే దేశ జనాభాలో 50% కంటే ఎక్కువ ఆధారపడి ఉన్నారన్నారు. దీనిపై ఫోకస్ పెంచడం ద్వారా భారత్ ఫుడ్ సప్లయ్ చైన్‌లో గ్లోబల్ లీడర్ అవుతుందన్నారు. ఈరోజుల్లో వర్క్ ఫ్రమ్ హోం సాధారణం అయిపోయిందని.. ఇంట్లో కూర్చుని మరోవైపు వ్యవసాయం పర్యవేక్షించుకుంటూ ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. ఈ బడ్జెట్ ద్వారా మరింత ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అలాగే గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇచ్చారని.. సూర్య ఘర్ పథకం ద్వారా విద్యుత్ పంపిణీ నష్టాలు లేకుండా స్వయం సమృద్ధి కుటుంబ స్థాయిలో సాధ్యపడుతుందన్నారు. ‘‘చాలా కాలం క్రితం ఒక మాట చెప్పా.. కమ్యూనిజం అయిపోయింది.. ఇప్పుడు టూరిజం మాత్రమే మిగిలి ఉంది అని. ఇప్పుడు అదే జరిగింది. చైనాలో కూడా అనుసరిస్తున్న విధానం కమ్యూనిజం కాదు. సరైన నాయకత్వంలో సరైన దిశలో దేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడుస్తున్నాయి’’ అని చెప్పుకొచ్చారు.


ఆ రెండు రాష్ట్రాల్లో ఫెల్యూర్..

ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్‌లో రెండూ ఫెయల్యూర్ మోడల్స్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో డ్రైనేజీ వాటర్, డ్రింకింగ్ వాటర్ కలిసిపోతున్నాయన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించాలని అనుకున్నారని.. కానీ ఢిల్లీలో ఆ పథకాన్ని అమలు చేయలేదని.. అలా చేస్తే క్రెడిట్ మోడీకే వెళ్తుందని చేయలేదని అన్నారు. స్వచ్ఛ భారత్ కూడా అమలు చేయలేదని.. ఢిల్లీలో ఎక్కడ చూసినా దుర్గంధమే... చెత్తాచెదారమే అని విమర్శించారు. ఢిల్లీలో కొత్త మౌలిక వసతులు ఏవైనా కల్పించారా? ఎప్పుడో కట్టినవే తప్ప కొత్త ప్రాజెక్ట్స్ ఏమీ లేవన్నారు. ఎవరైనా ఢిల్లీకి ఉపాధి అవకాశాల కోసం వస్తారని... కానీ ఇప్పుడు అందరూ ఢిల్లీ విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.


రాష్ట్రానికి కొంత ప్రయారిటీ...

బీజేపీ, ఎన్డీఏకు ఎందుకు ఓట్లు వేయాలో చెప్పడానికి ఢిల్లీ వచ్చానని అన్నారు. ఢిల్లీ చూసినప్పుడు అందరిలో ఒక అభిప్రాయం వస్తుందని.. ఢిల్లీలో వాతావరణ కాలుష్యం, రాజకీయం కాలుష్యం ఆరోగ్యానికి హానీకరమన్నారు. ఢిల్లీలో కలుషితమైన నీరు ఉందని.. యమున కలుషితం అయిపోయిందన్నారు. వికసిత భారత్ రియాలిటీ అని చెప్పుకొచ్చారు. దావోస్‌లో అందరూ ఇండియా గురించి మాట్లాడుతున్నారన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్టానికి ఆక్సిజన్ ఇచ్చారని.. రాష్ట్ర అభివృద్ధికి ఇంకా కష్టపడాలని అన్నారు. గత పాలనతో రాష్ట్ర అభివృద్ధి 30 ఏళ్లు వెనక్కి వెళ్ళిందని వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్‌లో రాష్టానికి కొంత ప్రయారిటి ఇచ్చారన్నారు. బడ్జెట్‌లో ఏం ఇచ్చారని కొందరు అంటున్నారని.... మన పేరు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. 16 వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చర్చిస్తానని.. లోటు బడ్జెట్ ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


కాగా.. ఆదివారం ఢిల్లీలోని షహదారా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థుల తరపున నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న చంద్రబాబు... షహదారా ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి సంజయ్‌ గోయల్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ఈరోజు ఏపీకి రానున్నారు సీఎం. నేటి మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీ నుంచి ఏపీ సచివాలయానికి చంద్రబాబు రానున్నారు. ఆర్టీజీతో పాటు ప్రభుత్వ పథకాల, కార్యక్రమాల అమలుపై ఫీడ్ బ్యాక్‌పై సమీక్ష చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు సచివాలయం నుంచి ఉండవల్లి నివాసానికి వెళతారు సీఎం చంద్రబాబు.


ఇవి కూడా చదవండి...

AP News: ఆ పదవి కోసం మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యూహం

బంగారం ధరలు షాక్ కొట్టిస్తున్నాయి..

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 03 , 2025 | 10:22 AM