Share News

Angani fire on YSRCP: పేదలకు ఇళ్ల పట్టాలు.. మండలిలో వైసీపీపై మంత్రి అనగాని ఫైర్

ABN , Publish Date - Mar 03 , 2025 | 01:54 PM

Angani fire on YSRCP: ఏపీ శాసనమండలిలో వైసీపీపై మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగనన్న ఇళ్ల పథకం పెద్ద కుంభకోణంలా మారిందని, లబ్దిదారుల ఎంపికలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు.

Angani fire on YSRCP: పేదలకు ఇళ్ల పట్టాలు.. మండలిలో వైసీపీపై మంత్రి అనగాని ఫైర్
AP Assembly budget Session

అమరావతి, మార్చి 3: ఏపీ శాసనమండలిలో (AP Legislative Council) ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై వైసీపీ ఎమ్మెల్సీలు రాజశేఖర్, హనుమంతురావు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anaganai Satyaprasad) సమాధానమిచ్చారు. అందరికీ ఇళ్ల పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలను అందజేస్తామని స్పస్టం చేశారు. ఇప్పటి వరకు ఇళ్ల పట్టాల కోసం 70,232 దరఖాస్తులు వచ్చాయన్నారు. గత ప్రభుత్వం సెంటు స్థలం మాత్రమే ఇవ్వగా కూటమి ప్రభుత్వం రెండు, మూడు సెంట్ల స్థలం ఇస్తోందని తెలిపారు.


అంతేకాక ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందిస్తోందన్నారు. జగనన్న ఇళ్ల పథకం పెద్ద కుంభకోణంలా మారిందని ఈ సందర్భంగా మంత్రి విమర్శించారు. లబ్దిదారుల ఎంపికలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. ధనవంతులు, ఉద్యోగులు, పార్టీ కార్యకర్తలు, అనుయాయులకు ఇళ్ల పట్టాలు పంచి పెట్టారని మండలిలో వెల్లడించారు. ఇళ్ల పట్టాల కోసం భూముల కోనుగోలులోనూ పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని మంత్రి చెప్పారు.


నివాసయోగ్యం కాని భూములను, స్మశానాలు, డంపింగ్ యార్డులు పక్కనున్న భూములను, వర్షం వస్తే మునిగిపోయే భూములను రెండింతలు, మూడింతలు అధిక ధరలకు ప్రభుత్వంతో కొనిపించారని దుయ్యబట్టారు. మొత్తం 10,500 కోట్ల రూపాయలతో 26 వేల ఎకరాల ప్రైవేట్ భూములను కొనుగోలు చేశారని.. ఇందులో నుండి వేల కోట్ల రూపాయలు వైసీపీ నేతలు, కార్యకర్తల జేబుల్లోకి వెళ్లాయని అన్నారు. కానీ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మాత్రం పేదలకు మేలు చేయాలనే లక్ష్యంతోనే అందరికీ ఇళ్ల పథకాన్ని చేపట్టిందని మంత్రి అనగాని సత్య ప్రసాద్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

Case on Posani Murali Krishna: పోసానిపై కేసు.. రాజంపేటకు నరసారావుపేట పోలీసులు

Toddy Cat spotted: కృష్ణా జిల్లాలో అరుదైన జాతి పునుగుపిల్లి

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 03 , 2025 | 01:54 PM