Share News

Lokesh Visit Davos: అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయండి: మంత్రి లోకేష్

ABN , Publish Date - Jan 23 , 2025 | 07:40 AM

దావోస్‌ సదస్సు వేదికగా దిగ్గజ కంపెనీల అధినేతలతో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్‌ వరుస సమావేశాలు నిర్వహించారు. సీఆర్డీయే పరిధిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ఎయిరిండియా సిఈవో క్యాంప్ బెల్ విల్సన్‌ను కోరారు. దుబాయ్ తరహాలో 3 వేల నుంచి 5 వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Lokesh Visit Davos:  అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయండి: మంత్రి లోకేష్
AP Minister Nara Lokesh

అమరావతి: సీఆర్డీయే (CRDA) పరిధిలో అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) ఏర్పాటు చేయాలని ఎయిరిండియా సిఈవో (Air India CEO) క్యాంప్ బెల్ విల్సన్‌ (Campbell Wilson)ను ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Loeksh) కోరారు. దుబాయ్ తరహాలో 3 వేల నుంచి 5 వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి విమానాశ్రయం గ్లోబల్ ఏవియేషన్‌లో కీలకపాత్ర వహించటంతో పాటు ఏపీకి అంతర్జాతీయ ట్రాఫిక్, పెట్టుబడులు వస్తాయని లోకేష్ అన్నారు. అలాగే విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రాంతీయ మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్ హాల్ హబ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సదుపాయం కల్పించడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడమేగాక ఎయిరిండియా కార్యాచరణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందన్నారు. ప్రతిపాదిత హబ్‌తో ఉపాధి అవకాశాలు కలగటంతో పాటు అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహం లభిస్తుందన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో పైలట్లు, స్టీవార్డెస్, టెక్నికల్ టీం కోసం శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.

ఈవార్త కూడా చదవండి..

చంద్రబాబుతో భేటీలో బిల్ గేట్స్ రియాక్షన్..


కాగా దావోస్‌ సదస్సు వేదికగా దిగ్గజ కంపెనీల అధినేతలతో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్‌ వరుస సమావేశాలు నిర్వహించారు. పెట్టుబడులకు తమ రాష్ట్రం గమ్యస్థానమంటూ కంపెనీలను ఏపీకి ఆకర్షించేందుకు ప్రయత్నించారు. తెలిపారు. ఏపీలో సమర్థవంతమైన పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కోసం హైవోల్టేజి డైరెక్ట్‌ కరెంట్‌(హెచ్‌వీడీసీ) వంటి అధునాతన సాంకేతికతలను అమలు చేయడంలో సహకరించాలని హిటాచీ ఇండియా ఎండీ భరత్‌ కౌశల్‌ను మంత్రి కోరారు. వైజాగ్‌ మెట్రో ప్రాజెక్టు, గ్రీన్‌ ఎనర్జీ కార్యక్రమాలకు సాంకేతిక సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మూడు వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్ల (కడప, అనంతపురం, తాడేపల్లిగూడెం) ఏర్పాటుకు సంబంధించి పనులను వేగవంతం చేయాలని సూచించారు. భరత్‌ కౌశల్‌ స్పందిస్తూ.. ఇప్పటికే జాన్సన్‌ కంట్రోల్స్‌, హిటాచీ ఎయిర్‌ కండిషనింగ్‌ ఇండియా లిమిటెడ్‌ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి, విజయవాడ, కాకినాడలో బహుళ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రారంభించిందని, త్వరలో అనంతపురం, బొబ్బిలిలో మరో రెండు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. 2018లో ఏపీలో మూడు వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్లను నిర్మించేందుకు హిటాచీ ఇండియా కాంట్రాక్టులను పొందిందని, త్వరలో వీటి పనులు ప్రారంభిస్తామన్నారు. ఏపీలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల్లో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ గ్లోబల్‌ చైర్మన్‌ జాన్‌ డ్రూను లోకేశ్‌ కోరారు. ఆగ్నేయాసియా, పశ్చిమాసియాతో భారత్‌ మార్కెట్‌ను అనుసంధానించడానికి వీలుగా ఏపీలో ట్రేడ్‌ హబ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. జాన్‌ డ్రూ స్పందిస్తూ.. భారత్‌లో 13 సెంటర్లు పనిచేస్తున్నాయని, మరో 7 నిర్మాణంలో ఉన్నాయని, వీటికి అదనంగా మరో 9 సెంటర్లను పెట్టే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. ఏపీలో సెంటర్లను, ట్రేడ్‌ హబ్‌ పెట్టే ప్రతిపాదనను పరిశీలిస్తామన్నారు. కాగా, ఏపీని హెల్త్‌కేర్‌ టెక్నాలజీ హబ్‌గా మార్చేందుకు డబ్ల్యూఈఎఫ్‌ తరఫున సహకారం అందించాలని లోకేశ్‌ ఆ సంస్థ అధినేత శ్యాం బిషన్‌ను కోరారు. శ్యాం బిషన్‌ స్పందిస్తూ.. భారత్‌లో మెడిసిన్‌ ఫ్రమ్‌ ద స్కై కార్యక్రమాన్ని ప్రారంభించాలని భావిస్తున్నామని, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.


డేటా సెంటర్ల ఏర్పాటుకు సహకరించండి

ఏపీలో టెమాసెక్‌ గ్రూపు అనుబంధ సంస్థ క్యాపిటా ల్యాండ్‌ ద్వారా ఇండస్ట్రియల్‌ పార్కులు, డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టాలని లోకేశ్‌.... టెమాసెక్‌ స్ట్రాటజిక్‌ హెడ్‌ రవి లాంబాను కోరారు. టెమాసెక్‌ మరో అనుబంధ సంస్థ సెంబ్‌కార్ప్‌తో కలిసి రెన్యువబుల్‌ ఎనర్జీ, గ్రీన్‌ హైడ్రోజన్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. విశాఖ, తిరుపతిలో సెమాటెక్‌ టెలీ మీడియా ద్వారా డేటా సెంటర్లు, డేటా సెంటర్‌ పార్కుల ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రవిలాంబా స్పందిస్తూ.. రాబోయే మూడేళ్లలో భారత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, హెల్త్‌కేర్‌ రంగాల్లో 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నామని, 2028 నాటికి క్యాపిటాల్యాండ్‌ ద్వారా భారత్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు రెట్టింపు చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై తప్పకుండా సానుకూలంగా స్పందిస్తామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భార్యను ముక్కలు ముక్కలుగా నరికి, ఉడకబెట్టి..

సీఎం వచ్చే వరకు ఆపండి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 23 , 2025 | 07:40 AM