Marri Rajasekhar Resigns: మర్రి రాజశేఖర్‌కు బుజ్జగింపులు.. ఇదే ఫైనల్ అన్న ఎమ్మెల్సీ
ABN , Publish Date - Mar 19 , 2025 | 01:20 PM
Marri Rajasekhar Resigns: వైసీపీకి రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ రాజీనామా పత్రాన్ని మండలి చైర్మన్‌కు అందజేశారు. అయితే రాజశేఖర్‌ను బుజ్జగించేందుకు వైసీపీ సభ్యులు ప్రయత్నించినప్పటికీ అవి ఫలించలేదని చెప్పుకోవాలి.

అమరావతి, మార్చి 19: వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ (YSRCP MLC Marri Rajsekhar) రాజీనామా ఇప్పుడు అసెంబ్లీలో హాట్‌టాపిక్‌గా మారింది. వైసీపీకి రాజీనామా చేసిన మర్రి.. కాసేపటి క్రితమే శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజును (AP Legislative Council Chairman moshen raju) కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని మండలి చైర్మన్‌ను కోరారు. మర్రి రాజశేఖర్ పదవీకాలం 2029 వరకూ ఉంది. వైసీపీకి రాజీనామా చేసిన ఆయన త్వరలో తెలుగుదేశం (TDP) గూటికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
అయితే.. రాజీనామాకు సిద్ధమైన రాజశేఖర్‌ను బుజ్జగించేందుకు ప్రయత్నించారు వైసీపీ నేతలు. రాజీనామాను ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కోరారు. అయితే తాను నిర్ణయం తీసేసుకున్నట్లు తేల్చిచెప్పేశారు రాజశేఖర్. వైసీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
PM Narendra Modi: చెక్కుచెదరని విశ్వాసానికి సునీతా విలియమ్స్ నిదర్శనం: ప్రధాని మోదీ..
కాగా.. చిలకలూరిపేట ఇన్‌చార్జిగా విడదల రజనీని నియమించడం పట్ల మర్రి రాజశేఖర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రజనీని వైసీపీ ఇన్‌చార్జిగా నియమించిన నాటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి, అయోద్యరామిరెడ్డి బుజ్జగించినప్పటికి ఆయన అసంతృప్తిలోనే ఉన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఘోరంగా ఓడిపోయిన రజనీని మరల చిలకలూరిపేట ఇన్‌చార్జిగా ఎలా నియమిస్తారని రాజశేఖర్ ప్రశ్నించారు. చివరకు వైసీపీకి గుడ్‌బై చెప్పేయాలని నిర్ణయించుకున్న ఆయన.. రాజీనామా పత్రాన్ని మండలి చైర్మన్‌కు అందజేశారు. కానీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేస్తున్నారని తెలిసిన వెంటనే లాబీలో ఆయనతో మాట్లాడేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. రాజీనామా చేయాలని నిర్ణయం తీసేసుకున్నట్లు వారికి తేల్చి చెప్పేశారు రాజశేఖర్.
ఇప్పటి వరకూ నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ వైసీపీకి గుడ్‌బై చెప్పేశారు. మర్రి రాజశేఖర్ రాజీనామాతో వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీల సంఖ్య ఐదుకు చేరింది. అయితే మర్రి రాజశేఖర్ బాటలో మరికొందరు వైసీపీ ఎమ్మెల్సీలు ఉన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ ఎవరంటూ మండలి లాబీలో విస్తృత చర్చనడుస్తోంది.
త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ: మర్రి
శాసనమండలి లాబీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ... ప్రస్తుతానికి ఎమ్మెల్సీగా రాజీనామా చేసినట్లు తెలిపారు. వెంటనే ఆమోదించాలని కూడా చైర్మన్‌ను కోరానన్నారు. ఇప్పుడు చిలకలూరిపేట వెళ్లి వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు చెప్పారు. కార్యకర్తలతో మాట్లాడాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. ఆ తర్వాత రాజీనామాకు గల కారణాలపై అన్ని విషయాలు వెల్లడిస్తానని మర్రి రాజశేఖర్ తెలిపారు.
ఎమ్మెల్సీల ఒత్తిడి...
ఇదిలా ఉండగా.. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు.. చైర్మన్‌ను కలిసి రాజీనామాలను ఆమోదించాలని డిమాండ్ చేశారు. బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళం వెంకట రమణ వైసీపీకి గుడ్‌బై చెప్పేయగా.. ఇంతవరకు వారి రాజీనామాను చైర్మన్ ఆమోదించలేదు. దీంతో ఈరోజు టీ బ్రేక్‌లో చైర్మన్‌ను కలిసిన ముగ్గురు ఎమ్మెల్సీలు తమ రాజీనామాను ఆమోదించాలన్నారు. దీనిపై స్పందించిన చైర్మన్ త్వరలోనే పరిశీలిస్తామని చెప్పారు. తమ రాజీనామాలను ఆమోదించాల్సిందేనని ఎమ్మెల్సీలు పట్టుబట్టారు.
ఇవి కూడా చదవండి...
Sunita Williams: రోజుకు 16 సార్లు సూర్యోదయం.. సునీతా విలియమ్స్ అనుభవాలు ఇవే..
Hyderabad: హలో నాగమణి.. అమ్మాయి కావాలి
Read Latest AP News And Telugu News