NTR Death Anniversary: సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ ఎన్టీఆర్‌కు ఎన్నో రికార్డ్స్..
ABN , Publish Date - Jan 18 , 2025 | 11:33 AM
MP Kesineni: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ముందు వెళ్లారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. టీడీపీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ సొంతమన్నారు. రాజకీయాలలో నైతిక విలువలు పాటిస్తూ, ప్రతి పేదవాడి అభివృద్ధిని ఆకాంక్షించిన రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు.

అమరావతి, జనవరి 18: స్వర్గీయ నందమూరి తారకరామారావు (Nandamuri Taraka Ramarao) వర్థంతి సందర్భంగా టీడీపీ నేతలు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. విజయవాడ పటమట సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి ఎంపీ కేశినేని శివనాథ్ (MP Kesineni Shivanath), ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్(MLA Gadde Rammohan) పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా అన్న ఎన్టీఆర్ అలుపెరగని యోధుడిలా ఎన్నో రికార్డ్స్ సృష్టించారన్నారు. తెలుగు దేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి పార్టీని తీసుకువచ్చి అరుదైన రికార్డ్ సృష్టించారని తెలిపారు.
మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh) నేతృత్వంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌కు కోటి సభ్యత్వాలతో ఘన నివాళి అర్పిస్తున్నామన్నారు. పేదవాళ్లకు కూడు, గూడు, గుడ్డ నినాదంతో దేశానికి సంక్షేమ పథకాల మార్గదర్శనం చేసిన దార్శనికుడు అని కొనియాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) నాయకత్వంలో ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ముందు వెళ్లారన్నారు. టీడీపీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ సొంతమన్నారు. రాజకీయాలలో నైతిక విలువలు పాటిస్తూ, ప్రతి పేదవాడి అభివృద్ధిని ఆకాంక్షించిన రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. రాజకీయ రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించి, ఢిల్లీలో కూడా తెలుగు వాడి సత్తా చూపించిన ఘనుడు ఎన్టీఆర్ అని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు.
ప్రతీవర్గం అభివృద్ధి కృషి: గద్దె రామ్మోహన్
పేదవాడికి పక్కా గృహాల పథకానికి పునాది వేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు నందమూరి తారక రామారావు అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ప్రతి వర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి పేదవాడికి అన్ని సౌకర్యాలు కల్పించి ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు.
స్వగ్రామంలో వర్ధంతి కార్యక్రమాలు...
అటు స్వగ్రామం నిమ్మకూరులో స్వర్గీయ ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు పూలమాలలతో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, కూటమి నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమార్ రాజా మాట్లాడుతూ.. తెలుగువారి మనసుల్లో అన్న ఎన్టీఆర్ చిరంజీవిగా నిలిచి ఉంటారన్నారు. 29 ఏళ్లు గడిచినా ఎన్టీఆర్ స్మృతులు నేటికీ ప్రజల కల్ల ఎదుట మెదులుతున్నాయన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మహానుభావుడని.. ఎన్టీఆర్‌ను తెలుగుజాతీ ఎన్నటికీ మరువదని అన్నారు. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో.. సీఎం చంద్రబాబు నాయకత్వంలో తామంతా ప్రజలు మంచి కోసం పనిచేస్తున్నామని ఎమ్మెల్యే రాజా వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
సింగపూర్‌లో రెండో రోజు.. సీఎం రేవంత్ ఎవరెవరిని కలిశారంటే
Tirumala: తిరుమలలో తమిళనాడు భక్తుల నిర్వాకం.. భద్రతలో డొల్లతనం
Read Latest AP News And Telugu News