Home » NTR Death Anniversary
‘ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు.. తెలుగువారి ఆత్మగౌరవం. పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం.
హైదరాబాద్: ఎన్టీఆర్ ఘాట్ ( NTR Ghat) నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ (శనివారం) ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్(Hyderabad)లోని ఎన్టీఆర్ ఘాట్‌కు లోకేశ్ చేరుకున్నారు.
CM Chandrabab: ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన.. మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు జాతిని నెంబర్ వన్‌గా మారుస్తామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
Atchannaidu: ఎన్టీఆర్ సామాన్య కుటుంబంలో పుట్టి అంచలంచెలుగా ఎదిగారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్ సినీ రాజకీయ రంగంలో మకుటం లేని మహారాజుల ఎదిగారని తెలిపారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో ఎన్టీఆర్ అధికారంలోకి తీసుకు రాగలిగారని.. బీసీలకు రాజకీయ అవకాశం కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.
Nara Lokesh: సినిమాలు, రాజకీయాల్లో ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించారని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు. తెలుగు వాళ్లను గతంలో మద్రాసీలు అనేవారని.. వాళ్లందరికీ తెలుగు వారమని గర్వంగా చెప్పుకునేలా ఎన్టీఆర్ చేశారని మంత్రి నారా లోకేష్ అన్నారు.
MP Kesineni: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ముందు వెళ్లారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. టీడీపీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ సొంతమన్నారు. రాజకీయాలలో నైతిక విలువలు పాటిస్తూ, ప్రతి పేదవాడి అభివృద్ధిని ఆకాంక్షించిన రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు.
టీడీపీ నేతలపై లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. చంద్రబాబు ఎప్పుడూ కూడా లక్ష్మీపార్వతి పేరును ప్రస్తావించలేదని చెప్పారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలని చెప్పుకునే లక్ష్మీపార్వతి టీడీపీలో ఎందుకు ఉండలేదని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.
NTR Death Anniversary:ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించారు. తెలుగుజాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్‌ను మరచిపోలేరని బాలకృష్ణ ఉద్ఘాటించారు.
NTR Death Anniversary: ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు.. ప్రభంజనం. అదొక సంచలనంమని ఏపీ మంత్రి నారా లోకేష్ స్మరించుకున్నారు తెలుగువాడి విశ్వరూపం ఎన్టీఆర్ అని కొనియాడారు. సామాజిక న్యాయం, ప్రజాసంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ నిర్మితమైందని నారా లోకేష్ పేర్కొన్నారు.
రేపు (జనవరి 18, 2025న) ఎన్టీఆర్ అభిమానులకు ఒక ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే నందమూరి తారక రామారావు 29వ వర్థంతి సందర్భంగా రేపు ఆయన గౌరవానికి నివాళి అర్పించడానికి తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ చేరుకోనున్నారు.