Vijayawada: సినిమా లెవెల్ ట్విస్ట్.. పోలీసులకే ఝలక్ ఇచ్చిన గంజాయి బ్యాచ్..
ABN , Publish Date - Jan 07 , 2025 | 08:49 PM
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కొందరు వ్యక్తులు గంజాయి తరలిస్తు్న్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏసీపీ తిలక్ పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వారి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఎన్టీఆర్ జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాలపై ఉక్కుపాదం మోపుతోంది. వైసీపీ (YSRCP) హయాంలో గంజాయి హబ్‌గా మారిన ఏపీని ప్రక్షాళన చేసే దిశగా చంద్రబాబు సర్కార్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులకు సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గంజాయి సరఫరాదారులపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న అనేక మందిని పట్టుకుని కటకటాల వెనక్కి పంపిస్తున్నారు.
APSRTC: గుడ్ న్యూస్.. సంక్రాంతి వేళ ఇంటికి వెళ్లాలని అనుకుంటున్నారా.. అయితే..
ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు ఇవాళ (మంగళవారం) ఉదయం నుంచీ గంజాయి తరలిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నందిగామ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏసీపీ తిలక్ పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టారు. అయితే విజయవాడ వైపు నుంచి ఓ కారులో కొంతమంది వ్యక్తులు గంజాయి తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందింది. కీసర టోల్ ప్లాజాను కారు క్రాస్ చేసిందన్న సమాచారంతో పోలీసులు అటువైపుగా వెళ్లారు.
Visakha: ఏపీపై వరాల జల్లు.. రేపే ప్రారంభించనున్న ప్రధాని మోదీ..
నందిగామ బైపాస్‌లోని ఇళ్ల స్థలాల వద్ద కారును గుర్తించారు. వారిని చూసిన నిందితులు వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. కారు స్వాధీనం చేసుకున్న పోలీసులు కారును గంజాయి ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఇవాళ (మంగళవారం) ఉదయం కూడా జగ్గయ్యపేట మండలం గౌరవరం సమీపంలో గంజాయి తరలిస్తున్న కారును పట్టుకున్నారు. అయితే పాయిపోయిన నిందితుల కోసం ఉదయం నుంచీ డ్రోన్ సహాయంతో పోలీసులు జల్లెడ పడుతున్నారు. నిందితుల కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Andhra Pradesh: దారుణం.. ప్రియురాలి తండ్రి కళ్ళల్లో కారం కొట్టి మరీ..
Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బిగుస్తున్న ఉచ్చు.. సుప్రీం కీలక తీర్పు