Share News

Notices: పేర్ని నాని సతీమణి జయసుధకు మరోసారి నోటీసులు

ABN , Publish Date - Jan 01 , 2025 | 12:23 PM

రేషన్ బియ్యం మాయం కేసులో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్‌పేట పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే పోలీసులు నోటీసులు ఇచ్చే సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి తలుపులకు నోటీసులు అంటించి వెళ్లిపోయారు.

Notices: పేర్ని నాని సతీమణి జయసుధకు మరోసారి నోటీసులు

కృష్ణాజిల్లా, మచిలీపట్నం: రేషన్ బియ్యం మాయం కేసు (Ration Rice theft Case)లో వైఎస్సార్‌సీపీ నేత (YSRCP Leader), మాజీ మంత్రి పేర్ని నాని (Ex Minister Perni Nani) సతీమణి (Wife) జయసుధ (Jayasudha)కు మరోసారి పోలీసులు (Police) నోటీసులు (Notices) ఇచ్చారు. కేసు విచారణలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్‌పేట పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసులో జయసుధకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. బెయిల్ మంజూరు సందర్భంగా పోలీసుల విచారణకు సహకరించాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి నోటీసులు ఇచ్చేందుకు పేర్ని నాని ఇంటికి పోలీసులు వెళ్లారు. అయితే పేర్ని నాని కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఇంట్లో లేకపోవడంతో ఇంటి తలుపులకు నోటీసులు అంటించి వెళ్లిపోయారు. కాగా రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధకు కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. సోమవారం (డిసెంబర్ 30వ తేదీ) కృష్ణాజిల్లా కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కేసులో పోలీస్ విచారణకు సహకరించాలంటూ పేర్ని జయసుధకు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఈ మేరకు న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.


బందరు మండలం పోట్లపాలెం సమీపంలో పేర్ని నాని తన భార్య జయసుధ పేరు మీద.. బఫర్ గోడౌన్ నిర్మించారు. అయితే వార్షిక తనిఖీల్లో భాగంగా ఇటీవల ఆ గోడౌన్లలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే గోడౌన్‌లో ఉన్న బియ్యం నిల్వకు.. అధికారిక పత్రాల్లో ఉన్న నిల్వలకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. ఆ క్రమంలో దీనిపై మాజీ మంత్రి పేర్ని నాని భార్యను వివరణ కోరారు. వే బ్రిడ్జ్ సరిగ్గా పని చేయడం లేదంటూ.. తొలుత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పేర్ని జయసుధకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దాంతో బియ్యం షార్టేజ్‌కు సంబంధించి.. రూ. 1.79 కోట్ల డీడీని ప్రభుత్వానికి పేర్ని నాని చెల్లించారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అందులో భాగంగా గోడౌన్‌లో మొత్తం 378 మెట్రిక్ టన్నుల బియ్యం షార్టేజ్ వచ్చినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అదనంగా మరో రూ. 1.67 కోట్లు చెల్లించాలంటూ పేర్ని జయసుధకు జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సోమవారం నోటీసులు జారీ చేశారు.


కాగా గత జగన్ ప్రభుత్వ హయాంలో పేర్ని నాని సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై పేర్ని నాని.. ప్రెస్ మీట్ పెట్టి తనదైన శైలిలో స్పందించే వారు. అంతేకాదు.. ఆయనకు మంత్రి పదవి లేకున్నా.. ప్రతి అంశంపై మాట్లాడుతుండే వారు. ఆ క్రమంలో నాటి ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలపై విమర్శలు గుప్పించే వారు. అయితే ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవి చూసింది. ఆ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. అలాంటి వేళ.. వార్షిక తనిఖీల్లో పేర్ని నాని సతీమణికి సంబంధించిన గోడౌన్లలో రేషన్ బియ్యం మాయం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతేకాదు.. ఈ బియ్యం మాయం కేసులో తమ తప్పు ఒప్పుకున్నట్లుగా ప్రభుత్వానికి కోట్లాది రూపాయిలు సైతం చెల్లించడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి..

మావోయిస్ట్ లీడర్ హీడ్మా టార్గెట్‌గా స్పెషల్ ఆపరేషన్

కాణిపాకంలో భక్తుల కోసం అధికారుల వినూత్న ప్రయోగం

విదేశీ ప్రయాణికులపై ఐటీ ఫోకస్

కాణిపాక వినాయక ఆలయానికి పోటెత్తిన భక్తులు

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 01 , 2025 | 12:24 PM