Share News

High Court Orders: బోరుగడ్డపై పోలీసుల పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Mar 24 , 2025 | 03:20 PM

AP High Court Orders: రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బోరుగడ్డపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది.

High Court Orders: బోరుగడ్డపై పోలీసుల పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు
AP High Court Orders Borugadda Anil

అమరావతి, మార్చి 24: రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై (Borugadda Anil) కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని హైకోర్టులో (AP High Court) పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అనుబంధ పిటిషన్‌పై ఈరోజు (సోమవారం) కోర్టులో విచారణ జరిగింది. కోర్టు నిర్దేశించిన సమయంలోపు జైలు అధికారుల ముందు ఎందుకు హాజరుకాలేదో వివరణ ఇవ్వాలని బోరుగడ్డను హైకోర్టు ఆదేశించారు. అలాగే తప్పుడు ధృవపత్రం సమర్పించి మధ్యంతర బెయిల్ పొందిన వైనంపై విచారణ నివేదికలను సీల్డ్ కవర్లో కోర్టు ముందు ఉంచాలని పోలీసులకు న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఏపీ హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది.


తన తల్లికి హార్ట్ సర్జరీ చేయించాల్సి ఉందని, గుండె సంబంధిత ఇబ్బందితో తల్లి ఇబ్బంది పడుతోందని చెన్నై ఆస్పత్రిలో ఉన్నారని.. తనకు బెయిల్ ఇవ్వాలంటూ గతంలో హైకోర్టులో బోరుగడ్డ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో కోర్టు బోరుగడ్డకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే ఈ పిటిషన్‌ దాఖలు చేసిన సమయంలో గుంటూరుకు చెందిన ఓ డాక్టర్ ఇచ్చిన రిపోర్టును కోర్టుకు సమర్పించారు బోరుగడ్డ. తరువాత ఆ సర్టిఫికెట్‌పై పోలీసులు ఎంక్వైరీ చేయగా.. అది ఫేక్ డాక్యుమెంట్‌గా తేలింది.

IPL 2025: ఢిల్లీ దుమ్ము రేపుతుందా.. లక్నోకు లక్ కలిసొస్తుందా..


దీంతో బోరుగడ్డ వెంటనే లొంగిపోవాలని, జైలు వద్దకు రావాలని పోలీసులు చెప్పగా.. అతడు ఆలస్యంగా అక్కడకు చేరుకున్నారు. దీనిపై పోలీసులు ప్రశ్నించగా.. వేర్వేరు కారణాలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో బోరుగడ్డపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా. అనుబంధ పిటిషన్‌పై ఈరోజు న్యాయస్థానం విచారించింది. నిర్దేశించిన సమయంలోపు ఎందుకు హాజరుకాలేదో వివరణ ఇవ్వాలని అటు బోరుగడ్డ అనిల్‌కు ఆదేశం ఇవ్వడంతో పాటు.. తప్పుడు ధృవపత్రాలు సమర్పించి మధ్యంతర బెయిల్ పొందిన వైనంపై కూడా పూర్తి స్థాయి నివేదికను సీల్డ్ కవర్‌లో అందించాలని పోలీసులను ఆదేశించింది కోర్టు.


ఇవి కూడా చదవండి...

Nagpur Riots Latest Update: నాగ్‌పూర్ అల్లర్లలో నిందితుడిపై మహా సర్కార్ రియాక్షన్ ఇదీ..

Loan Repayment Tips: ఇలా చేయకపోతే... అప్పుల్లో తలనొప్పులు ఖాయం

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 24 , 2025 | 03:32 PM