Supreme Court: వైసీపీ నేత గౌతంరెడ్డికి సుప్రీంలో ఊరట
ABN , Publish Date - Jan 24 , 2025 | 11:07 AM
Gowtham Reddy: వైసీపీ నేత గౌతం రెడ్డి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీం. ఆధారాలను ధ్వంసం చేయడం, సాక్ష్యులను బెదిరించడం చేయకూడదని స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ, జనవరి 24: వైఎస్సార్పీ నేత గౌతంరెడ్డికు సుప్రీంలో ఊరట లభించింది. అతనిపై నమోదైన హత్యాయత్నం కేసులో గౌతంరెడ్డికి సుప్రీం ధర్మాసనం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆయనకు పలు షరతులను కూడా విధించిన సుప్రీంకోర్టు. దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరించాలని, దర్యాప్తు అధికారి ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరు కావాలని న్యాయస్థానం షరతు విధించింది. ఆధారాలను ధ్వంసం చేయడం, సాక్ష్యులను బెదిరించడం చేయకూడదని స్పష్టం చేసింది. ఇతర షరతులు అన్ని దర్యాప్తు అధికారి నిర్ణయిస్తారని సుప్రీం కోర్టు ఆదేశాల్లో పేర్కొంది. జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఫోర్జరీ పత్రాలతో తన భూమిని ఆక్రమించడమే కాకుండా, తనను చంపేందుకు ప్రయత్నించారంటూ గౌతంరెడ్డిపై విజయవాడకు చెందిన గండూరి ఉమామహేశ్వరశాస్త్రి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. రూ.కోట్ల విలువైన స్థలం కొల్లగొట్టేందుకు వైసీపీ నేత కిరాయి హత్యకు ప్రణాళిక వేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. దీంతో గౌతం రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాగా.. సత్యనారాయణపురం శివాలయం వీధికి చెందిన గండూరి ఉమామహేశ్వరశాస్త్రి తల్లి పేరిట లక్ష్మీనగర్‌లో 325 చదరపు అడుగుల స్థలం కొని, 2014లో రిజిస్టర్ చేశారు. తమ స్థలాన్ని గౌతమ్‌రెడ్డి ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేశారని ఉమామహేశ్వరశాస్త్రి ఆరోపించారు. ఈ స్థలంపై వీరిద్దరి మధ్య ఏడేళ్లుగా వివాదం నడుస్తోంది. గౌతమ్‌రెడ్డి విజయవాడ కార్పొరేషన్ అనుమతి తెచ్చి ఈ స్థలంలో గ్రౌండ్ ఫ్లోర్, రెండు అంతస్తులు నిర్మించారు. 2017లో శాస్త్రి ఫిర్యాదు మేరకు సత్యనారాయణపురం ఠాణాలో గౌతమ్‌రెడ్డిపై కేసు పెట్టారు. గౌతమ్‌రెడ్డి వ్యవహారంపై శాస్త్రి యూట్యూబ్‌లో వీడియోలతో తన ఆవేదన పోస్టు చేశారు.
Kidney Racket: అలకనంద కిడ్నీ రాకెట్ కేసు.. ప్రభుత్వం ఆలోచన ఇదీ
దీంతో సత్యనారాయణను హత్య చేసేందుకు గౌతం రెడ్డి సుపారీ ఇచ్చారు. దీంతో కొంత మంది వ్యక్తులు ఉమామహేశ్వరశాస్త్రిపై ఇంట్లోకి ప్రవేశించి ఆయపై దాడి చేసి ఇంట్లోని స్థలం పత్రాలను తీసుకుని పరారయ్యారు. దీంతో అదే రోజు ఈ విషయంపై సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. దాడికి పాల్పడిన తొమ్మిది మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం బయటకు రావడంతో గౌతంరెడ్డి కనిపించకుండా పోయారు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టులో గౌతం రెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో గౌతంరెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈనెల 2న సుప్రీంలో తొలిసారి విచారణకు రాగా.. తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న గౌతం రెడ్డి అభ్యర్థనతో సుప్రీం ధర్మాసనం ఏకీభవిస్తూ.. తదుపరి విచారణ వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశిస్తూ కేసు విచారణను నేటికి వాయిదా వేసింది. ఈరోజు విచారణలో భాగంగా గౌతం రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు.
ఇవి కూడా చదవండి..
డ్రోన్ షో చూసి మంత్రముగ్ధులైన భక్తులు.. ఎక్కడంటే..
అమ్మ ఎక్కడా అని అడిగితే నాన్న మౌనం..
Read Latest AP News And Telugu News