Palla Srinivas Speech: ఎన్టీఆర్ ఆశయాల సాధనకు చంద్రబాబు వెంటే నేనూ
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:05 PM
Palla Srinivas Speech: తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అనేక సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేసిన పార్టీ అని పల్లా శ్రీనివాస్ అన్నారు. 40 ఏళ్లుగా అన్న ఎన్టీఆర్ ఆశయాలను భుజస్కంధాలపై మోస్తూ పార్టీని అభివృద్ధి చేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.

అమరావతి, మార్చి 29: పేదలు, కార్మికులు, ప్రజలు, రాజకీయ అనిశ్చితిని దృష్టిలో పెట్టుకుని రాజకీయ చైతన్యం కోసం అన్న ఎన్టీఆర్ (NTR) తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ (AP TDP Chief Palla Srinivas) అన్నారు. టీడీపీ ఆవిర్భావన దినోత్సవం సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. ‘ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం’ అనే నినాదంతో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఏర్పడిన పార్టీ తెలుగుదేశం అని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అనేక సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేసిన పార్టీ అని తెలిపారు.
సామాజిక న్యాయాన్ని పాటిస్తూ అన్ని వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించే పార్టీ టీడీపీ అని అన్నారు. 40 ఏళ్లుగా అన్న ఎన్టీఆర్ ఆశయాలను భుజస్కంధాలపై మోస్తూ పార్టీని అభివృద్ధి చేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అని కొనియాడారు. వెనుకబడిన వర్గాలు, ముఖ్యంగా మహిళలు, యువతకు అండగా నిలిచే పార్టీ తెలుగుదేశమన్నారు. ‘నా ప్రాణం ఉన్నంత వరకు ఎన్టీఆర్ ఆశయాల సాధనకు చంద్రబాబు అడుగుజాడలోనే నడుస్తానని పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు.
కార్యకర్తలే పార్టీ బలం, బలగం: అనిత
అమరావతి: నీతి, నిజాయతీలకు మారుపేరు తెలుగుదేశం పార్టీ అని పొలిట్ బ్యూరో సభ్యులు, హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) అన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. జై తెలుగుదేశం... ఈ నినాదంతో నీతి, నిజాయితీ గల తెలుగుదేశం పార్టీ కార్యకర్త గుండెలు ఉప్పొంగుతాయని.. అవినీతి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయన్నారు. సంక్షేమం, అభివృద్ధి, తెలుగు జాతి ఆత్మ గౌరవ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అని.. తెలుగుదేశం పార్టీ అంటేనే మానవత్వం ఉన్న పార్టీ అని చెప్పుకొచ్చారు. రాజకీయ పార్టీలకు మానవత్వాన్ని అలవరిచిన నాయకులు ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ అని అన్నారు. సొంత ఖర్చులతో గుండెను తరలించి ఓ గుండెకు ప్రాణంపోసిన నాయకుడ సోదరుడు లోకేష్ అని కొనియాడారు. 43 ఏళ్లుగా ఎన్నో త్యాగాలు చేసి పార్టీని నిలబెట్టిన నాయకులందరికీ పాదాభివందనమన్నారు.
Lokesh Speech Highlights: రికార్డులు సృష్టించేది.. బద్దలు కొట్టేది టీడీపీనే
ఎన్ని ఒడిదుడుకులొచ్చినా పార్టీ జండా వదలని కార్యకర్తే తెలుగుదేశం పార్టీ బలం, బలగమని తెలిపారు. నీతి, నిజాయితీలతో తన విజన్‌తో ప్రపంచంలో తెలుగువారికి గుర్తింపునిచ్చి తండ్రి స్థానంలో పార్టీని నిలబెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడన్నారు. 1998లో అమెరికాలోని ఇల్లినాయిస్ గవర్నర్ చంద్రబాబు గౌరవార్ధం సెప్టెంబర్ 24న నాయుడు డేగా ప్రకటించడం పార్టీ కార్యకర్తకు గర్వకారణమన్నారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా చంద్రబాబు గురించి తెలియని వాళ్లుండరన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఎప్ప్పుడైనా సరే రోజుకు 16 గంటలు పనిచేసే వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు.
విజన్ 2020 పెట్టిన రోజుల్లో తాను విద్యార్థిని అని... అదే 2020లోకి వచ్చేటప్పటికి తాను మహిళా అధ్యక్షురాలిగా చంద్రబాబు పక్కన కూర్చోగలుగుతున్నామంటే అదే విజనరీ అని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా చంద్రబాబు విజన్ కనిపిస్తుందన్నారు. ఇప్పుడు అదే విజన్ అమరావతికి రాబోతుందన్నారు. నాలుగు తరాలు కాదు నలభైతరాల వరకు కూడా అమరావతి అంటే చంద్రబాబు, తెలుగుదేశం పార్టీనే గుర్తొస్తుందన్నారు. 2047 విజన్ పెట్టుకుని వచ్చే ఐదేళ్లలో ఏం చేయాలో, 2047కి ఏం చేయాలో ఒక ప్రణాళిక పెట్టుకుని పని చేస్తున్న విజనరీ చంద్రబాబు అని అన్నారు. రాష్ట్రంలోని బిడ్డలకు ఎలాంటి చదువు ఇవ్వాలి, ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వాలి, ప్రజలకు ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలి అని ప్రణాళికలు వేస్తున్నారని తెలిపారుర.పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పుట్టిన తెలుగుదేశం పార్టీకి మణిహారం చంద్రబాబు అని తెలిపారు. పేదరిక నిర్మూలన , తలసరి ఆదాయం పెంపు లక్ష్యంగా ఉగాదికి పీ4 విధానం ప్రారంభంకాబోతుందన్నారు. కష్ట, నష్టాలు, అవమానాల సమయంలో జెండాను పట్టుకున్న ప్రతి ఒక్కరికీ హోంమంత్రి అనిత కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి
TDP: తెలుగుదేశం 43వ ఆవిర్భావ దినోత్సవం
Lokesh Speech Highlights: రికార్డులు సృష్టించేది.. బద్దలు కొట్టేది టీడీపీనే
Read Latest AP News And Telugu News