Panchumarthy: అక్కడ ఓటర్ల లిస్టు కంటే.. పెద్దిరెడ్డి పాపాల లిస్టే ఎక్కువ
ABN , Publish Date - Jan 30 , 2025 | 03:09 PM
Panchumarthy Anuradha: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. మదనపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఫైల్స్ తగలబడిన ఘటనతో తనకేమీ సంబంధం లేదన్న పెద్దిరెడ్డి ముందస్తు బెయిల్ ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు. పుంగనూరు ఓటర్ లిస్ట్ కంటే పెద్దిరెడ్డి పాపాల లిస్టే ఎక్కువన్నారు. 75 ఎకరాల ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకోవడమే కాక దర్జాగా అడవిలోకి రోడ్డు వేసుకొని ప్యాలెస్ కట్టుకున్నారంటూ వ్యాఖ్యలు చేశారు.

అమరావతి, జనవరి 30: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై (Former Minister Peddireddy Ramachandra Reddy) టీడీపీ ఎమ్మెల్సీ, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ (MLC Panchumarthy Anuradha) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి పగలు చేసేది పూజలు రాత్రిళ్ళు చేసేది దోపిడీలు అంటూ ధ్వజమెత్తారు. జగన్‌కు ఏమాత్రం తగ్గకుండా పెద్దిరెడ్డి అవినీతి పుంకాలు, పుంకాలుగా బయటికొస్తోందన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేయాల్సిన పాపాలన్నీ చేసి ఇప్పుడు తనకేమీ తెలియదు అంటే పోతుందా అని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి.. ల్యాండ్, శాండ్, వైన్ మాఫియాతో వేలకోట్లు కొల్లగొట్టింది వాస్తవం కాదా అని నిలదీశారు.
శివశక్తి డైయిరీ పేరుతో పాడి రైతుల కష్టార్జితాన్ని దోచుకుంది వాస్తవం కాదా అని మండిపడ్డారు. మదనపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఫైల్స్ తగలబడిన ఘటనతో తనకేమీ సంబంధం లేదన్న పెద్దిరెడ్డి ముందస్తు బెయిల్ ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు. పుంగనూరు ఓటర్ లిస్ట్ కంటే పెద్దిరెడ్డి పాపాల లిస్టే ఎక్కువన్నారు. 75 ఎకరాల ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకోవడమే కాక దర్జాగా అడవిలోకి రోడ్డు వేసుకొని ప్యాలెస్ కట్టుకున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ దగ్గర ప్రభుత్వ భూమిలో 20 ఎకరాలు పెద్దిరెడ్డి భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న మాట వాస్తవం కాదా అని అన్నారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కట్టాలంటూ ఊర్లకు ఊర్లు ఖాళీ చేసి ప్రజల ఉసురు పోసుకున్నారని విమర్శించారు. ఈ ఘటనలో ఎన్‌జీటీ పెద్దిరెడ్డికి 100 కోట్లు ఫైన్ వేసిన మాట వాస్తవం కాదా అని అన్నారు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన దగ్గర్నుంచి పెద్దిరెడ్డి తన అవినీతి సామ్రాజ్యాన్ని దేశవ్యాప్తం చేశారు అంటూ పంచుమర్తి విరుచుకుపడ్డారు.
MLA: గన్‌మ్యాన్ లేకుండానే ప్రజల వద్దకు ఎమ్మెల్యే..
ప్రభుత్వం సీరియస్..
కాగా.. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో 75 ఎకరాల అటవీ భూములను పెద్దిరెడ్డి అక్రమంగా కబ్జా చేయడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది సర్కార్. ఇందుకోసం జాయింట్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. జాయింట్ కమిటీలో సభ్యులుగా చిత్తూరు కలెక్టర్ సుమిత్, జిల్లా ఎస్పీ మనికంఠ చందోలు, ఐఎఫ్ఎస్ అధికారి యశోద బాయ్ ఉన్నారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది. మరోవైపు పెద్దిరెడ్డి అటవీ భూభక్షణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ అయ్యారు. అటవీశాఖ అధికారులతో మాట్లాడిన ఉపముఖ్యమంత్రి.. భూకబ్జాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి...
Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు
AP News: ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ
Read Latest AP News And Telugu News