Share News

Tiruvuru: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌పై టీడీపీ అధిష్ఠానం ఫైర్.. విషయం ఇదే..

ABN , Publish Date - Jan 18 , 2025 | 05:10 PM

ఆంధ్రప్రదేశ్: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌(MLA Kolikapudi Srinivas)పై చర్యలు తీసుకునేందుకు టీడీపీ (TDP) రంగం సిద్ధం చేస్తోంది. మహిళపై దాడి ఘటన నేపథ్యంలో టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట కొలికపూడి సోమవారం హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Tiruvuru: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌పై టీడీపీ అధిష్ఠానం ఫైర్.. విషయం ఇదే..
MLA Kolikapudi Srinivas

అమరావతి: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌(MLA Kolikapudi Srinivas)పై చర్యలు తీసుకునేందుకు టీడీపీ (TDP) రంగం సిద్ధం చేస్తోంది. మహిళపై దాడి ఘటన నేపథ్యంలో టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట కొలికపూడి సోమవారం హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. జనవరి 11న ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం గోపాలపురం (Gopalapuram) గ్రామానికి చెందిన ఎస్టీ మహిళపై కొలికిపూడి దాడి చేశాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఘటనపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. దాడికి సంబంధించిన కారణాలను క్రమశిక్షణ కమిటీ ముందు తెలపాలంటూ ఆయనకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కొలికపూడి వ్యవహారంలో తిరువూరు ఘటనపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఓ మహిళపై కొలికపూడి దాడి చేశారంటూ మళ్లీ పెద్దఎత్తున విమర్శలు రావడంపై టీడీపీ అధిష్ఠానం విచారణకు ఆదేశించింది. ఆయన ఇచ్చే వివరణను క్రమశిక్షణ కమిటీ బృందం హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనుంది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పార్టీ అధిష్ఠానం ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోనుంది.


జనవరి 11న ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు గోపాలపురం గ్రామానికి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వెళ్లారు. అనంతరం అన్నదమ్ములకు చెందిన ఓ స్థల వివాదం పరిష్కరించేందుకు వారి ఇంటి వద్దకు ఎమ్మెల్యే వెళ్లారు. అయితే సమస్యను సామరస్యంగా పరిష్కరించకుండా ఎమ్మెల్యే తనను దుర్భాషలాడి, దాడి చేశారంటూ స్థలానికి చెందిన మహిళ పురుగులమందు సేవించింది. తమ కుటుంబంపై దాడి చేశారంటూ ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో హుటాహుటిన సదరు మహిళను ఆస్పత్రికి తరలించారు. కాగా, తన సొంత నిధులతో పంట కాలువల పూడికలు తీయించానని, కుక్కలకైనా విశ్వాసం ఉంటుందేమో కానీ రైతులకు ఉండదంటూ ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు సైతం తీవ్ర దుమారం రేపాయి. ఇలాంటి వరస ఘటనతో టీడీపీ అధిష్ఠానం ఆగ్రహానికి గురైంది. ఎమ్మెల్యేను విచారించాలని క్రమశిక్షణ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Kadapa: మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పోస్ట్.. చంద్రబాబుకు విజ్ఞప్తి..

Palnadu: రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. చిన్నపిల్లలే లక్ష్యం.. సినిమా లెవల్ స్టోరీ..

Updated Date - Jan 18 , 2025 | 05:26 PM