Share News

AP News: ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసనగా యువకులు ఆత్మహత్యాయత్నం..

ABN , Publish Date - Mar 28 , 2025 | 10:29 AM

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. ఇప్పటికే అనేక ఆరోపణలతో వివాదాస్పదమైన ఆయన.. అలవాల రమేష్ రెడ్డిపై విమర్శలు చేశారు. దీంతో ఎమ్మెల్యేపై గిరిజన యువకులు, మహిళలు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రమేష్ రెడ్డిపై చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు.

AP News: ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసనగా యువకులు ఆత్మహత్యాయత్నం..
Kolikapudi Srinivasa Rao

ఎన్టీఆర్ జిల్లా: ఏ.కొండూరు మండలం రేపూడికి చెందిన స్థానిక టీడీపీ నేత (TDP Leader),తిరువూరు మాజీ ఏఎంసి చైర్మన్ అలవాల రమేష్ రెడ్డి Ramesh Reddy)పై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (MLA Kolikapudi Srinivasa Rao) చేసిన అసత్య ఆరోపణలను (Comments) గిరిజన యువకులు (Tribal youth, మహిళలు (Womens) ఖండించారు. ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గిరిజన యువకులు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం (Suicide Attempt)చేశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ.. రమేష్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఏ.కొండూరు మండలం, రేపూడి గ్రామంలో గిరిజన మహిళలు ఆందోళన చేపట్టారు. టీడీపీ నేత రమేష్ రెడ్డిపై ఎమ్మెల్యే చేసిన అసత్య ఆరోపణలను గిరిజన మహిళలు ఖండించారు. తిరువూరులో ఎమ్మెల్యే ఇంటి వద్ద మీటింగ్ ఉందని, లోన్లు కొరకు రావాలని, డబ్బులు ఇస్తామని రమ్మంటే వెళ్లామని గిరిజన మహిళలు వాపోయారు. రమేష్ రెడ్డిపై ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు నిరూపించాలని మహిళలు నినాదాలు చేశారు.

Also Read..: ప్యాన్ స్లోగా తిరుగుతుందా.. కారణమిదే..


కాగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ అలవాల రమేశ్‌రెడ్డిపై 48 గంటల్లోపు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధిష్ఠానానికి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అల్టిమేటం జారీ చేశారు. రమేశ్‌రెడ్డి నిర్వాకాలను ఇప్పటికే పార్టీ దృష్టికి తీసుకెళ్లానని, 48 గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని గట్టిగా చెప్పారు. తిరువూరులోని ఎమ్మెల్యే కొలికపూడి నివాసానికి గురువారం ఏ.కొండూరు మండలంలోని పలు గిరిజన తండాలకు చెందిన మహిళలు వచ్చి నిరసన తెలిపారు. ఏఎంసీ మాజీ చైర్మన్‌ రమేశ్‌రెడ్డి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, పనుల కోసం వెళ్లేవారిని కామవాంఛ తీర్చమంటున్నాడని వారంతా వాపోయారు. రుణం కావాలని అడిగిన మహిళను లొంగదీసుకునేందుకు తీవ్ర ఒత్తిడి తెచ్చాడని తెలిపారు. మహిళలతో నీచంగా ప్రవర్తిస్తున్న రమేశ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఎమ్మెల్యే కొలికపూడి స్పందించారు. రమేశ్‌రెడ్డి లైంగిక వేధింపుల విషయం ఇప్పటికే అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లానని, 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ‘ఎమ్మెల్యే అంటే నాకు భయమా, నాపై ఎంపీ ఈగవాలనివ్వడు. ఎంపీ ఆఫీసులో మూల్పూరు కిషోర్‌కు తనను కాపాడమని నాలుగు ట్రాక్టర్లు, రూ.50 లక్షలు డబ్బు ఇచ్చాను.’ అని రమేశ్‌రెడ్డి చెబుతున్నాడని, దీనిపై తాను విచారణ జరపగా, ఒక్క ట్రాక్టర్‌ ఇచ్చాడని తేలిందన్నారు. డబ్బు ఇచ్చిన విషయం మాత్రం తెలియదన్నారు. రమేశ్‌రెడ్డి తన దగ్గరకొచ్చినా, పార్టీ కార్యక్రమాల్లో కనిపించినా చెప్పు తెగేదాకా కొడతానని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను 10 రోజుల నుంచి ఎంపీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, పరిశీలకుడికి చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రమేశ్‌రెడ్డి ఆడియో విన్న తర్వాత నిలువునా పాతర వేయాలని అనిపించిందన్నారు. ఒక పెద్ద నాయకుడిని చెప్పాక.. రెండు మూడు రోజుల్లో చర్యలు ఉంటాయని భావించానని, కానీ అది జరగలేదన్నారు.


బ్యాలెన్స్‌గా, బాధ్యతాయుతంగా ఉంటున్నా..

శాసనసభ్యుడిగా ఉన్నందున చాలా బ్యాలెన్స్‌గా, బాధ్యతాయుతంగా, పార్టీకి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో 12, 13 రోజుల నుంచి కంట్రోల్‌ చేసుకుని ఉంటున్నానని ఎమ్మెల్యే కొలికపూడి అన్నారు. ఒక గిరిజన మహిళ రుణం అడిగితే.. అసభ్యకరంగా మాట్లాడిన ఓ నాయకుడిపై ఇప్పటివరకు వరకు స్పందించలేదంటే ఎలా.. అని ప్రశ్నించారు. అదే ఇతర కులాల నాయకులైతే ఇలాగే స్పందిస్తారా.. కులాలకు ఓ న్యాయమా.. నాయకుడికి మరో న్యాయమా? అని పార్టీ పెద్దలను అడుగుతున్నానన్నారు. తండాల మహిళలు తమ సమస్యలను చెప్పుకొనేందుకు తిరువూరు వస్తుంటే, వైసీపీకి చెందిన నాయకులు వైకుంఠరావు, చిన్నయ్య దొరలు.. వారిని బెదిరింపు ధోరణితో అడ్డుకుంటున్నారని, తప్పుచేసిన టీడీపీ నాయకుడ్ని కాపాడేందుకు వైసీపీ నాయకులు ఎందుకు తాపత్రయపడుతున్నారని కొలికపూడి ప్రశ్నించారు. చివరకు ఒక పాస్టర్‌ సైతం ఫోన్‌ చేశారని ఆయన ఆరోపించారు. ఎ.కొండూరు గిరిజన తండాల్లో 320 మరుగుదొడ్ల నిర్మాణం పేరుతో రమేశ్‌రెడ్డి నిధులు కైంకర్యం చేస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగి బలయ్యాడని ఎమ్మెల్యే ఆరోపించారు. నియోజకవర్గంలో వంద టిప్పర్లు మట్టి తోలకాలు చేస్తుంటే, మూడు టిప్పర్లపై కేసు నమోదు చేశారని, 97 టిప్పర్లను పట్టించుకోలేదని, మట్టి తోలకాల వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలని ఎమ్మెల్యే కోరారు. కేసులు నమోదు చేసిన టిప్పర్లు ఎవరివని, కేసులు నమోదు చేయని టిప్పర్లు ఎవరివని ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శుక్రవారం రోజు ఈ పనులు ఎందుకు చేయకూడదో తెలుసా..

జీవితంలో ఒకసారైనా సందర్శించాల్సిన ఆలయాలు ఏమిటో తెలుసా..

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

For More AP News and Telugu News

Updated Date - Mar 28 , 2025 | 10:29 AM