Rammohan Naidu: ఏపీ మిర్చి రైతుల సమస్యలపై కేంద్రం నిర్ణయం ఇదే..
ABN , Publish Date - Feb 21 , 2025 | 12:56 PM
Rammohan Naidu: ఏపి మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) విజ్ఞప్తితో ఏపీ మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి చర్యలు చేపట్టినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) తెలిపారు. శుక్రవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసిన అనంతరం రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. మిర్చి రైతుల సమస్యలను సీఎం చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని, మిర్చి ఎగుమతులు పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. మిర్చి రైతుల సమస్యలపై శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సుదీర్ఘ సమావేశం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులు సమావేశంలో పాల్గొన్నారని తెలిపారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
మిర్చి ఉత్పత్తి వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం లెక్కిస్తే రూ. 11,600 వచ్చిందని.. అంతకంటే ఎక్కువ మొత్తంలో రైతులకు అందేలా చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. గతంలో మాదిరిగా ఇప్పుడు మిర్చి ఎగుమతులు జరగడం లేదన్నారు. మిర్చి ఎగుమతులు పెంచడం గురించి కూడా ఇవాళ్టి సమావేశంలో చర్చించామన్నారు. రాష్ట్రంలో మిర్చి రైతులు, ఎగుమతిదారులతో సదస్సు పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. సదస్సు ద్వారా వచ్చిన సలహాలు, సూచనల ఆధారంగా మిర్చి ఎగుమతులు పెంచడంపై దృష్టి పెడతామన్నారు. మిర్చి రైతుల ఆదాయం ఎలా పెంచాలన్నదే అందరం ఆలోచిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు నాయుడు నేరుగా ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తెచ్చారన్నారు. రైతుల కష్టం తెలిసిన వ్యక్తి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అని.. నిన్న ఢిల్లీలో లేనప్పటికీ మధ్యప్రదేశ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ సీఎంతో మాట్లాడారని తెలిపారు. ఈరోజు ఢిల్లీ వచ్చిన వెంటనే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించారన్నారు.
జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ రాసలీలలు
మార్కెట్ రేటుకు, రైతుల పెట్టుబడి వ్యయానికి మధ్య ఉన్న గ్యాప్‌ను కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఆదుకోవాలని చూస్తున్నామన్నారు. ఉత్పత్తి వ్యయాన్ని రూ. 11,600 కంటే ఎక్కువగా నిర్ణయించాలని ఐసీఏఆర్‌ను కోరినట్లు చెప్పారు. మిర్చి ఎక్స్‌పోర్ట్స్ గతంలో జరిగినట్టు ఇప్పుడు జరగడం లేదని అన్నారు. మిర్చి పంట సేకరణను అత్యవసరంగా చేయిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. మార్కెట్ ఇంటర్వెన్షన్స్ స్కీం కింద 75% వరకు పొడిగిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్నారు. ఏపీలో మిర్చికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద క్వింటాల్‌కు 11600 లేదా ఉత్పత్తి వ్యయం జోడించి రూ.12,000 పైచిలుకు ధరను అందించాలని అడిగామన్నారు. ధర విషయంలో ఐసీఏఆర్ అధికారులకు కేంద్రమంత్రి ఆదేశాలిచ్చారని.. ఎగుమతులను స్థిరీకరించే అంశంపైన సమావేశంలో చర్చకు వచ్చిందన్నారు. ఎగుమతుల సమస్యను పరిష్కరించడానికి ఎగుమతి దారులతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మిర్చి రైతుల విషయంలో వీలైనంత త్వరగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Phone Tapping Case: ఫోన్‌ట్యాపింగ్ కేసు.. వంశీ కృష్ణ సంచలన వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News