Share News

Vamsi Bail Petition: వంశీ.. మరో ఐదు రోజులు ఆగాల్సిందే

ABN , Publish Date - Mar 21 , 2025 | 01:04 PM

Vamsi Bail Petition: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. వంశీకి బెయిల్ ఇవ్వొద్దని, బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ వాదించారు.

Vamsi Bail Petition: వంశీ.. మరో ఐదు రోజులు ఆగాల్సిందే
Vamsi Bail Petition

అమరావతి, మార్చి 21: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 26 వరకు వాయిదా పడింది. గన్నవరం టీడీపీ కార్యాలయంలపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరించి కేసుపై విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇప్పటికే మూడు దఫాలుగా వాదనలు వినిపించారు. ప్రధానంగా వంశీ తరపున న్యాయవాది వాదనలు వినిస్తూ.. ఈకేసులో వంశీని అన్యాయంగా ఇరికించారని, అనారోగ్య కారణాలతో ఆయన ఇబ్బంది పడుతున్నారని, అలాగే నెలరోజుల పైగా రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో వంశీకి బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది వాదనలు వినిపించారు.


అయితే సత్యవర్ధన్‌ను బెదిరించి, కిడ్నాప్ చేసిన వ్యవహారంపై అనేక ఆధారాలు సేకరించారని, వంశీకి బెయిల్ మంజూరు చేస్తూ సాక్షులను బెదిరించడమో, భయపెట్టడమో చేస్తారని ప్రాసిక్యూషన్ వాదించారు. అలాగే విదేశాలకు కూడా వెళ్లే ప్రమాదం ఉందన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వంశీకి బెయిల్‌ పిటిషన్‌ను రద్దు చేయాలని వాదనలు వినిపించారు. నిన్న(గురువారం) బెయిల్ పిటిషన్‌కు సంబంధించి ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయాధికారి ఈరోజు విచారణను వాయిదా వేశారు. నేడు తీర్పు వస్తుందని భావించినప్పటికీ విచారనను ఈనెల 26కు వాయిదా వేశారు న్యాయమూర్తి. మరి ఆరోజు వంశీకి బెయిల్ వస్తుందా రాదా అనే ఉత్కంఠ నెలకొంది.


మరోవైపు.. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సీఐడీ కస్టడీకి వంశీని ఇస్తూ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. వంశీని పది రోజుల పాటు కస్టడీ కోరుతూ విజయవాడ సీఐడీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ వేశారు. నిన్న(గురువారం) విచారణకు రాగా.. ఇరు వర్గాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించిన కోర్టు.. వంశీని మూడు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి...

Harish Rao On Budget: ఇది గట్టి బడ్జెట్టా... ఒట్టి బడ్జెట్టా.. అసెంబ్లీలో సర్కార్‌పై హరీష్ ఫైర్

10th Class Exams: తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభం.. ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు


Read Latest AP News And Telugu News

Updated Date - Mar 21 , 2025 | 01:26 PM