Vamshi Case: వంశీ కేసులో విజయవాడ కోర్టు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Feb 24 , 2025 | 03:08 PM
Vamshi: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో కీలక ఆదేశాలు జారీ చేసింది. వంశీని పోలీస్ కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం.

విజయవాడ, ఫిబ్రవరి 24: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి (Vallabhaneni Vamshi) బిగ్ షాక్ తగిలింది. వల్లభనేని వంశీని మూడు రోజుల పాటు కస్టడీకిస్తూ విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్ట్ (Vijayawada SC ST Special Court) ఆదేశాలు జారీ చేసింది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారించాలంటూ ఆదేశించింది. విజయవాడ లిమిట్స్‌లోనే కస్టడీలోకి తీసుకొని విచారించారంటూ న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయవాది సమక్షంలోనే విచారించాలంటూ ఎస్సీ ఎస్టీ కోర్టు ఆదేశించింది. అలాగే వెన్ను నొప్పి కారణంగా ఇబ్బంది పడుతున్నానంటూ వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు స్పందించింది. జైల్లో బెడ్ అనుమతిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కిడ్నాప్, బెదింరిపుల కేసులో వంశీని పదిరోజుల పాటు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో వంశీ పాత్ర కీలకంగా ఉందని, అతని కనుసన్నల్లోనే నడుస్తోందని.. మరింత విచారణ చేసేందుకు వంశీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోరారు. గత నాలుగు రోజులుగా ఈ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరుగుగా.. ఈరోజు న్యాయస్థానం తీర్పునిచ్చింది. వంశీని మూడు రోజు పాటు కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. రేపటి (మంగళవారం) నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు అదుపులోకి తీసుకుని 5 తర్వాత తిరిగి అప్పగించేలా ఆదేశించింది. అంతేకాకుండా న్యాయవాదులు చూసే విధంగా వంశీని విచారించాలని, రోజుకు మూడు సార్లు న్యాయవాది నేరుగా వంశీని కలిసి మాట్లాడేందుకు కోర్టు అనుమతించింది.
జగన్ మరో కీలక నిర్ణయం.. ఇక నుంచి..
అయితే రాజకీయ కుట్రలో భాగంగా కేసులో ఇరికించారంటూ వంశీ తరపు న్యాయవాదులు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అనుమానాలకు ఆస్కారం ఇవ్వకుండా న్యాయవాదుల సమక్షంలో విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. దీంతో రేపటి నుంచి మూడు రోజుల పాటు వంశీ.. పోలీసుల కస్టడీలో వివిధ ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంది. సత్య వర్ధన్ కిడ్నాప్, బెదిరింపులకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా పోలీసులు ఆధారాలు సేకరించారు. వీటన్నింటినీ కోర్టుకు సమర్పించారు పోలీసులు. దీంతో పోలీసులు కోరిన విధంగా పది రోజులు కాకుండా కేవలం మూడు రోజులు మాత్రమే వంశీని కస్టడీకి ఇస్తూ కోర్టు అనుమతించింది.
మరోవైపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ దర్యాప్తులో వేగం పెంచింది. ఇప్పటికే వంశీపై పీటీ వారెంట్ జారీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. రేపు (ఫిబ్రవరి 25న) వంశీని కోర్టులో హాజరుపర్చాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే వంశీని నేరుగా కోర్టుకు తీసుకువస్తారా లేక వర్చువల్‌గా హాజరుపరుస్తారా అనేది జడ్జి నిర్ణయం బట్టి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. వర్చువల్‌గా అని అంటే జైలు వద్దే వర్చువల్‌గా హాజరుపరిచి అక్కడి నుంచి నేరుగా కస్టడీలోకి తీసుకుంటారు. లేదా నేరుగా వచ్చి హాజరుపర్చాలని జడ్జి ఆదేశిస్తే.. కోర్టు సమయంలో ప్రారంభమైన వెంటనే వంశీ హాజరుపరిచి ఆ తరువాత పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి...
Somireddy: ఆ భయంతోనే అసెంబ్లీకి జగన్
Read Latest AP News And Telugu News