YS Sharmila Petrol Tax Criticism: వాటి ధరలు ఎప్పుడు తగ్గిస్తారు.. కూటమి సర్కార్‌కు షర్మిల ప్రశ్న
ABN , Publish Date - Mar 25 , 2025 | 10:52 AM
YS Sharmila Petrol Tax Criticism: పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలో పెట్రోల్, డిజిల్ ధరలు అధికంగా ఉన్నాయని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఇంధనం ధరల తగ్గింపుపై ఇచ్చిన హామీ ఏమైదంటూ కూటమి ప్రభుత్వాన్ని షర్మిల ప్రశ్నించారు.

విజయవాడ, మార్చి 25: ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి (APCC Chief YS Sharmila Reddy) స్పందించారు. పక్కనున్న రాష్ట్రాల్లో కంటే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అభివృద్ది శూన్యమంటూ వ్యాఖ్యలు చేశారు. కూటమిని గెలిపిస్తే ఇంధనంపై పన్ను తగ్గిస్తామని హామీ ఇచ్చారని.. ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఈరోజు పెట్రోల్ ధర రూ. 109.60 పైసలు, డీజిల్ ధర రూ 97.47 పైసలుగా ఉందన్నారు. పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో లీటరు పెట్రోల్ ధర రూ.100.86 పైసలు, డీజిల్ ధర రూ.92.39పైసలని తెలిపారు. అంటే తమిళనాడుతో పోల్చితే మన దగ్గర పెట్రోల్ మీద 9 రూపాయలు, డీజిల్ మీద 5 రూపాయలు ఎక్కువ ఉందన్నారు. అలాగే కర్ణాటకలో లీటరు పెట్రోల్ ధర రూ.102.90పైసలు, డీజిల్ ధర రూ.88.99పైసలు ఉందని.. కర్ణాటకతో పోల్చితే ఏపీలో పెట్రోల్ మీద లీటరుకు 7 రూపాయలు, డీజిల్ మీద 9 రూపాయలు ఎక్కువగా ఉందని చెప్పారు.
ఇంతే కాకుండా పక్కనున్న తెలంగాణలో లీటరు పెట్రోల్ ధర. రూ 107.46పైసలు, డీజిల్ ధర రూ. 95.70పైసలుగా ఉందని అన్నారు. అంటే తెలంగాణతో పోల్చినా ఏపీలో లీటరు మీద 3 రూపాయలు అదనంగా ఉందని చెప్పుకొచ్చారు. పన్నులు ఘనం.. అభివృద్ధి శూన్యం ఇది రాష్ట్ర పరిస్థితి అంటూ విమర్శలు గుప్పించారు. పెట్రోల్, డీజిల్ మీద పన్నులు తగ్గింపుపై టీడీపీ, వైసీపీ పార్టీలవి నీచ రాజకీయాలని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఒక మాట.. అధికారపక్షంలో మరో మాట అని ఫైర్ అయ్యారు. గత 10 ఏళ్లుగా రెండు పార్టీల ప్రభుత్వాలు చేసింది దారి దోపిడీ తప్పా మరొకటి కాదన్నారు. వ్యాట్ పేరుతో ఏ రాష్ట్రంలో లేనంతగా ప్రజలపై పన్ను పోటు విధించారన్నారు. దేశంలోనే అత్యధిక పన్నులు వేసిన రాష్ట్రంగా ముందువరసలో పెట్టి.. రాష్ట్ర ప్రజానీకాన్ని లూటీ చేశారని ఆరోపించారు. బాబు మొదటి 5 ఏళ్ల పాలనలో సుమారు రూ.20వేల కోట్ల మేర అదనపు పన్నులు వసూళ్లు చేస్తే.. నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ బాదుడే బాదుడు అంటూ ఎద్దేవా చేశారు. తీరా అధికారం ఇస్తే ఆయనే బాదుడుకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Vishnu Priya: బెట్టింగ్ యాప్స్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన విష్ణుప్రియ
5 ఏళ్లలో రూ.25 వేల కోట్ల మేర ఇంధనం మీద అదనపు పన్నులు వసూలు చేశారన్నారు. ఇద్దరు కలిసి 10 ఏళ్లలో ప్రజల నుంచి రూ.50 వేల కోట్లు బాదేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాడు ప్రతిపక్షంలో ఉండగా పెట్రోల్, డీజిల్ ధరలను గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారని గుర్తుచేశారు. లీటరుకు 17 రూపాయలు తగ్గించాలని డిమాండ్ చేశారన్నారు. కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఇంధనం ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారని... ఇచ్చిన హామీ ప్రకారం ఎప్పటి నుంచి ధరలు తగ్గిస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 17 రూపాయలు ధర తగ్గించి ఇచ్చిన హామీ వెంటనే నిలబెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని వైఎస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి..
AP High Court Case: బోరుగడ్డపై కోర్టు ధిక్కరణ కేసు!
Nuclear Boy FBI: 12 ఏళ్లకే ఇంట్లో న్యూ క్లియర్ రియాక్టర్ కట్టాడు.. తర్వాత FBI ఏజెంట్లు వచ్చి..
Read Latest AP News And Telugu News