YSRCP Corruption: ఆఖరికి కుక్కల తిండినీ వదలలేదుగా..
ABN , Publish Date - Mar 26 , 2025 | 10:45 AM
YSRCP Corruption: గత ప్రభుత్వ హాయంలో జరిగిన మరో అవినీతి బాగోతం బయటపడింది. వైసీపీ చేసిన పనిపై ప్రతీఒక్కరూ విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి.

అమరావతి, మార్చి 26: గత వైసీపీ (YSRCP) ప్రభుత్వ పాలన అంతా విధ్వంసమే.. అవినీతిమయే అన్నది జగమెరిగిన సత్యమే. దేన్ని వదలలేదు వైసీపీ పెద్దలు. ఎక్కడ భూములు కనిపించినా వదలలేదు. అన్ని వ్యవస్థలను సర్వనాశనం పట్టించారని కూటమి ప్రభుత్వ ఆరోపణ. ఇసుక, మద్యం ఇలా అన్నింటిలోనూ అవినీతికి పాల్పడిన విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ప్రభుత్వ పెద్దలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా గత ప్రభుత్వం హయాంలో జరిగిన మరో అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. వైసీపీ నేతలు మరీ ఇంత నీచాకానికి దిగజారారా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతకీ గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీస్ జాగిలాలు (కుక్కలు)కు పెట్టే తిండిలో కూడా కక్కుర్తి పడ్డారనే వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది. కుక్కలకు పెట్టే తిండిలోనూ నిధులు నొక్కేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో నిధులు స్వాహా చేసిన అధికారులపై ఉన్నతాధికారులు అభియోగాలు నమోదు చేశారు. అప్పటి ఇంచార్జి టీ శ్రీనివాసరావు నిబంధనలు పాటించకుండా 35 కుక్క పిల్లలను కొనుగోలు చేశారు. అయితే నాసిరకం తిండి పెట్టడంతో ఆ కుక్క పిల్లల ఆరోగ్యం దెబ్బతిన్న పరిస్థితి. ఆరోగ్యం దెబ్బతిన్న కుక్క పిల్లల స్థానంలో నిబంధనలకు విరుద్ధంగా మరికొన్నింటిని కొనుగోలు చేసిన వైనం ఆశ్చర్యానికి గురిచేసింది. వీటి కోసం అదనంగా బడ్జెట్ కేటాయింపులు కూడా జరిగాయి. శిక్షణలోనూ జాప్యం జరగడంతో ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
Kunl Kamra: కునాల్ కమ్రా వివాదం.. 500 బెదిరింపు కాల్స్ వచ్చాయి.. చంపుతామంటున్నారు
2021 జనవరి 28 నుంచి 2023 ఏప్రిల్ 24 మధ్య ఈ వ్యవహారం జరిగినట్టు అధికారులు గుర్తించారు. అప్పట్లో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీ శ్రీనివాసరావు, అప్పటిలో ఎస్పీగా పనిచేసి పదవీ విరమణ చేసిన సూర్యభాస్కర రెడ్డిపై ప్రభుత్వం అభియోగాలు మోపింది. అలాగే వాహనాలకు ఆయిల్ వినియోగంలోని కక్కుర్తి పడినట్లు తెలుస్తోంది. దాదాపు 4 వేల లీటర్ల పెట్రోల్ వాడకుండానే వినియోగించినట్టు అధికారులు నిధులు డ్రా చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు దీనిపై కూడా మరింత లోతుగా విచారణ చేపట్టే పనిలో పడ్డారు.
ఇవి కూడా చదవండి...
Betting Case: బెట్టింగ్ యాప్ కేసు.. మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు
CM Chandrababu Directives to Police: బెట్టింగ్‌పై సీఎం చంద్రబాబు సీరియస్.. నూతన చట్టానికి ప్లాన్..
Read Latest AP News And Telugu News