Kurnool : ముగ్గుల పోటీల్లో వెయ్యి మంది మహిళలు
ABN , Publish Date - Jan 14 , 2025 | 03:56 AM
కర్నూలు నగరంలోని క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో సోమవారం నిర్వహించిన ‘సంక్రాంతి ముగ్గుల పోటీల’కు అనూహ్య స్పందన లభించింది.
Andhra Jyothy : కర్నూలు నగరంలోని క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో సోమవారం నిర్వహించిన ‘సంక్రాంతి ముగ్గుల పోటీల’కు అనూహ్య స్పందన లభించింది. ఈ పోటీలకు వెయ్యి మందికిపైగా మహిళలు హాజరయ్యారు. పోటీల్లో విజేతలకు మొదటి బహుమతిగా ఓపెన్ ప్లాట్, రెండో బహుమతిగా ఈ-బైక్, మూడో బహుమతిగా సోఫా సెట్, నాలుగో బహుమతిగా పావు కిలో వెండి, 30 మందికి కన్సొలేషన్ బహుమతులు, పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రైస్ కుక్కర్‌ను కనుమ రోజు అందజేస్తారు.
- కర్నూలు కల్చరల్, ఆంధ్రజ్యోతి