Share News

AP Governor: శ్రీశైలం పర్యటనకు గవర్నర్ అబ్దుల్ నజీర్..

ABN , Publish Date - Feb 24 , 2025 | 08:14 AM

శ్రీశైలంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ సోమవారం శ్రీశైలం వస్తున్నారు. ఆది దంపతులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. రాత్రికి శ్రీశైలంలో బస చేస్తారు.

AP Governor: శ్రీశైలం పర్యటనకు గవర్నర్ అబ్దుల్ నజీర్..
AP Governor Abdul Nazeer

నంద్యాల: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ (AP Governor Abdul Nazeer) సోమవారం శ్రీశైలం (Srisailam) రానున్నారు. సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక హెలికాప్టరులో శ్రీశైలం వస్తారు. శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకోనున్నారు. రాత్రికి శ్రీశైలంలో గవర్నర్ బస చేస్తారు. మంగళవారం ఉదయం శ్రీశైలం నుంచి విజయవాడకు బయలుదేరి వస్తారు. కాగా శ్రీశైలంలో మహాశివరాత్రి (Mahashivaratri) బ్రహ్మోత్సవాలు (Brahmostavalu) ఆరోవరోజుకు చేరుకున్నాయి. సోమవారం ఉదయం ఆలయంలో శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆది దంపతులు సాయంత్రం పుష్పపల్లకిలో ఆశీనులై ప్రత్యేక పూజలందుకొనున్నారు. రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవార్లకు పుష్పపల్లకిలో గ్రామోత్సవం నిర్వహిస్తారు.

ఈ వార్త కూడా చదవండి..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. స్పీకర్ కీలక ఆదేశాలు..


శ్రీశైలానికి కాలినడకన ఎంపీ శబరి..

కాగా శ్రీశైలంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో కొందరు భక్తులు నల్లమల అటవీ మార్గం గుండా కాలినడకన శ్రీశైలానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి కూడా భక్తులతో కలిసి నల్లమలలో కాలినడకన శ్రీశైలం దేవస్థానానికి బయల్దేరారు. ఆమె వెంట భద్రతా సిబ్బంది, అనుచరులు ఉన్నారు.


శ్రీశైల మల్లన్నకు చీరాల తలపాగా సిద్ధం

కాగా శ్రీశైల మల్లన్నకు మహాశివరాత్రి నాడు ధరింపజేసే తలపాగాను తయారు చేసే మహదావకాశం బాపట్ల జిల్లా చీరాల మండలం దేవాంగపురి పంచాయతీకి చెందిన పృథివి సుబ్బారావుకు దక్కింది. దశాబ్దాలుగా సుబ్బారావు పూర్వీకులే మల్లన్న తలపాగాను మగ్గంపై స్వయంగా తయారు చేసి స్వామి తలకు చుట్టే ఆనవాయితీ. ఇటీవల సుబ్బారావు తండ్రి వెంకటేశ్వర్లు అనారోగ్యంబారిన పడడంతో ఈ ఏడాది ఆ అవకాశం సుబ్బారావుకు దక్కింది. 3 నెలలు శ్రమించి 360 మూరల పొడవున్న తలపాగాను తయారు చేశారు. దాన్ని ఆదివారం సుబ్బారావు, దుర్గ దంపతులు శ్రీశైలంలోని స్వామి సన్నిధికి తీసుకెళ్లారు. పండుగ రోజు ఆలయంలో అన్ని ప్రధాన దీపాలు ఆర్పివేశాక పాగాను స్వామివారికి సుబ్బారావు చుట్టనున్నారు. శ్రీశైల మల్లన్న తలపాగాను దర్శించుకోవడం వల్ల సర్వలోపాలు, పాపాలు తొలుగుతాయని భక్తుల విశ్వాసం.


ఈ వార్తలు కూడా చదవండి..

పది లక్షల వ్యాక్సిన్లు ఔట్‌

పాఠం నేర్పని పాపాలు

మీ డబ్బులు మీకిస్తాం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 24 , 2025 | 08:14 AM