Share News

Pawan Kalyan: ఆ జిల్లాలో పర్యటించనున్న పవన్ కల్యాణ్.. ఎందుకంటే..

ABN , Publish Date - Jan 08 , 2025 | 07:32 PM

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రేపు కర్నూలు (Kurnool) జిల్లాలో పర్యటించనున్నారు. గడివేముల (Gadivemula) మండలం గని వద్ద ఏర్పాటు చేసిన సోలార్ పార్క్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు సైట్‌ను ఆయన ఏరియల్ వ్యూ (Aerial View) ద్వారా పరిశీలించనున్నారు.

Pawan Kalyan: ఆ జిల్లాలో పర్యటించనున్న పవన్ కల్యాణ్.. ఎందుకంటే..
AP Deputy CM Pawan Kalyan

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రేపు కర్నూలు (Kurnool) జిల్లాలో పర్యటించనున్నారు. గడివేముల (Gadivemula) మండలం గని వద్ద ఏర్పాటు చేసిన సోలార్ పార్క్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు సైట్‌ను ఆయన ఏరియల్ వ్యూ (Aerial View) ద్వారా పరిశీలించనున్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉపముఖ్యమంత్రి రావడంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు సైతం పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు పవన్ పర్యటనపై జిల్లా ఎస్పీ తన సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతపై పలు సూచనలు చేశారు. ఉపముఖ్యమంత్రి పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

CM Chandrababu: విశాఖలో సీఎం చంద్రబాబు ఏం చెప్పారంటే..

Narendra Modi: నా ప్రేమాభిమానాలు చూపించే సమయం వచ్చింది

Updated Date - Jan 08 , 2025 | 07:58 PM