Share News

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం

ABN , Publish Date - Mar 16 , 2025 | 09:22 AM

శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి వారిని దర్శించుకోవడానికి ప్రతి రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. శ్రీశైలంకు వచ్చే భక్తులు వసతి కోసం శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్ సైట్‌ను సందర్శిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒక మోసం వెలుగులోకి వచ్చింది. వసతి కోసం దేవస్థానం అధికారిక వెబ్ సైట్‌ను సందర్శించే భక్తులను మోసం చేస్తున్న ఘటన తెరపైకి వచ్చింది.

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం
Srisailam Devasthanam

నంద్యాల : ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మరో తరహా మోసం వెలుగు చూసింది. శ్రీశైలం దేవస్థానం (Srisailam Temple) పేరుతో వెలిసిన నకిలీ వెబ్ సైట్లు (Fake Websites) కలకలం (Kalakalam) రేపుతున్నాయి. నకిలీ వెబ్ సైట్లతో భక్తులు (Devotees) మోసపోతున్నారు. హైదరాబాద్ (Hyderabad), ముంబాయి (Mumbai)కి చెందిన భక్తులు ఆన్ లైన్‌ (Online)లో నకిలి వెబ్ సైట్‌లో మల్లికార్జున సధన్ నందు వసతి కొసం రెండు రూములు బుక్ చేసుకున్నారు. శ్రీశైలం వచ్చి మల్లికార్జున సధన్ నందు బుకింగ్ చేసుకున్న మెస్సేజ్‌లు చూపించడంతో అక్కడ సిబ్బంది అవాక్కయ్యారు. దీంతో నకిలి వెబ్‌సైట్‌లలో రూములు బక్ చేసుకుని మోసపోయిన భక్తులు గ్రహంచారు.

Also Read..:

పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ నివాళి..


కాగా శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి వారిని దర్శించుకోవడానికి ప్రతి రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. శ్రీశైలంకు వచ్చే భక్తులు వసతి కోసం శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్ సైట్‌ను సందర్శిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒక మోసం వెలుగులోకి వచ్చింది. వసతి కోసం దేవస్థానం అధికారిక వెబ్ సైట్‌ను సందర్శించే భక్తులను మోసం చేస్తున్న ఘటన తెరపైకి వచ్చింది. శ్రీశైలం దేవస్థానం పేరుతో కొంతమంది కేటుగాళ్లు నకిలీ వెబ్‌సైట్ తయారు చేశారు. ఈ నకిలీ వెబ్‌సైట్‌తో శ్రీశైలంలో వసతి కోసం ప్రయత్నించే భక్తులను మోసగిస్తున్నారు. కొంతమంది భక్తులు శ్రీశైలంలో వసతి కోసం ఈ నకిలీ వెబ్‌సైట్‌ను ఆశ్రయించి డబ్బులు చెల్లించి మోసపోయారు.


శ్రీశైలం వచ్చే భక్తులను సైబర్‌ నేరగాళ్లు గతంలోనూ ఇలాంటి తరహా మోసాలకు పాల్పడ్డారు. వసతి కోసం ఆన్‌లైన్‌లో గదుల బుకింగ్‌ కోసం వెతికేవారిని లక్ష్యంగా చేసుకుని నకిలీ వెబ్ సైట్లు తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ మాదిరి నకిలీ వెబ్‌సైట్‌ తయారు చేసి దాని ద్వారా మోసం చేసిన ఘటన గతేడాదిలోనూ వెలుగు చూసింది. వసతి గదులను ఎక్కువగా ఆన్‌లైన్‌ ద్వారానే కేటాయిస్తుండటం.. సైబర్ మోసగాళ్లకు ఆసరాగా మారింది. తాజాగా మరోసారి ఈ తరహా మోసం వెలుగుచూడటంతో.. దేవస్థానం అధికారులు ఈ మోసాలపై దృష్టిపెట్టాలని భక్తులు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వారికి జీతాలు ఎలా ఇస్తారు: టీడీపీ

రూ. 800 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంఖుస్థాపన..

For More AP News and Telugu News

Updated Date - Mar 16 , 2025 | 09:31 AM

News Hub