పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి : సీపీఐ
ABN , Publish Date - Jan 11 , 2025 | 12:31 AM
పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని, లేకపోతే మంత్రి ఇంటిని ముట్టడిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు హెచ్చరించారు.
నంద్యాల రూరల్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని, లేకపోతే మంత్రి ఇంటిని ముట్టడిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు హెచ్చరించారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని నిరు పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని నంద్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుల ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ పేదలకు పట్టణంలో రెండుసెంట్లు, గ్రామాలలో మూడుసెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇళ్ల నిర్మాణాలకు ఐదు లక్షల రుణాలు ఇవ్వాలన్నారు. పేదలు ఇంటి స్థలాలు ఇవ్వకుంటే జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీటీ రామసంజీవరావుకు వినతి పత్రం అందజేశారు. పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, సీపీఐ శాఖ కార్యదర్శి, సహాయకార్యదర్శి హబీబ్‌బేగ్, షేక్షావలి, మద్దిలేటి, మద్దయ్య పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఆంధ్రజ్యోతి): అర్హులైన పేదలందరికి తక్షణమే ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని సీపీఐ నాయకులు నాగరాజు, టి.ప్రతాప్ డిమాండ్ చేశారు. ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన చేపట్టారు. ఆర్డీవో కార్యాలయ అడ్మిస్ర్టేషన్ ఆఫీసర్ శ్రీనివాసులుకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు అహ్మద్‌హుసేన్, లల్లు, షేక్షా, మాబాషా, పుల్లయ్య, ముర్తుజాబీ, స్వాతి, పుల్లమ్మ, లక్ష్మీబాయి తదితరులు ఉన్నారు.
మహానంది(ఆంధ్రజ్యోతి): అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వెంటనే ఇవ్వాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. తెలిపారు. మహానందిలో తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ నాయకులు ధర్నా చేశారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ధనుంజయ్, మండల కార్యదర్శి సామేల్, నాయకులు పాల్గొన్నారు.
గోస్పాడు(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలప్రకారం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ జిల్లా సమితి సభ్యుడు సూర్యప్రతాప్, మండల కార్యదర్శి హరినాథ్ డిమాండ్ ఛేశారు. శుక్రవారం తహసీల్దారు కార్యాలయం ఎదుట సమావేశం నిర్వహించి డీటీ హరితకు వినతి పత్రం అందజేశారు. జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మీదేవి, నరసింహులు, మౌలాలి పాల్గొన్నారు.