Share News

Manamitra Program: మనమిత్ర-వాట్సాప్‌ గవర్నెన్స్‌పై అవగాహన

ABN , Publish Date - Mar 28 , 2025 | 05:39 AM

ఆర్టీజీఎస్‌ (రియల్‌టైమ్‌ గవరెన్స్‌ సొసైటీ) రాష్ట్ర ప్రభుత్వ సేవలను వాట్సాప్‌ ద్వారా అందిస్తున్నది. అయితే, గ్రామీణ ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని, వాట్సాప్‌ గవర్నెన్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచాలని ఆర్టీజీఎస్‌ నిర్ణయించింది

Manamitra Program: మనమిత్ర-వాట్సాప్‌ గవర్నెన్స్‌పై అవగాహన

  • వచ్చేనెల రెండో వారంలో ఇంటింటా ప్రచారం

అమరావతి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): రియల్‌టైమ్‌ గవరెన్స్‌ సొసైటీ(ఆర్టీజీఎస్‌).. మనమిత్ర కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సేవలన్నింటినీ వాట్సా్‌పలోనే అందిస్తోంది. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో 9552300009కు మెసేజ్‌ చేస్తే చాలు. ఇలా ఇప్పటికే దాదాపు 350 ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. కానీ వాట్సాప్‌ గవర్నెన్స్‌పై ప్రజల్లో పూర్తి అవగాహన లేకపోవడంతో దీనిని గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. మధ్యవర్తులు, లంచాలు లేని వ్యవస్థను అమలు చేస్తున్నందున ఈ సేవల విధానంపై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఆర్‌టీజీఎస్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల రెండో వారం నుంచి ఇంటింటికీ మన మిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌పై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఇకపై ప్రజలు కార్యాలయాలకు వెళ్లకుండా నేరుగా వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా సేవలు పొందేలా అలవాటు చేయాలని ఆర్టీజీఎస్‌ భావిస్తోంది.

Updated Date - Mar 28 , 2025 | 05:39 AM