Sankranti Celebrations : అనంత సంబరాల్లో మంత్రులు
ABN , Publish Date - Jan 14 , 2025 | 03:44 AM
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం, పెనుకొండలో సోమవారం జరిగిన సంక్రాంతి సంబరాలలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, సవిత పాల్గొన్నారు.
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం, పెనుకొండలో సోమవారం జరిగిన సంక్రాంతి సంబరాలలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, సవిత పాల్గొన్నారు. ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ సరదాగా జరిగిన కోడి పందేలను పరిశీలించారు. సంప్రదాయ దుస్తులు ధరించి ఎడ్లబండిని తోలారు. పెనుకొండ జూనియర్ కాలేజీ మైదానంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలలో మంత్రి సవిత పాల్గొన్నారు. మహిళలతో కలిసి ముగ్గులు వేశారు. ఎడ్ల బండిని తోలారు.
- ఆంధ్రజ్యోతి, ధర్మవరం, పెనుకొండ టౌన్