Share News

Free Education : ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూల్‌ను సందర్శించిన భువనేశ్వరి

ABN , Publish Date - Jan 28 , 2025 | 06:31 AM

నారా భువనేశ్వరి సోమవారం చల్లపల్లి మండలం పాగోలులోని ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూల్‌ను సందర్శించారు.

Free Education : ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూల్‌ను సందర్శించిన భువనేశ్వరి

చల్లపల్లి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సోమవారం చల్లపల్లి మండలం పాగోలులోని ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూల్‌ను సందర్శించారు. ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అనాథలు, పేద పిల్లలకు ఉచితంగా చదువు చెబుతూ, వసతి కల్పించే ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూల్లోని విద్యార్థుల వసతి సౌకర్యాలు పరిశీలించారు. పిల్లలతో కలిసి భోజనం చేసి వారితో మాట్లాడారు. క్లాస్‌రూమ్‌లు, డిజిటల్‌ క్లాస్‌రూమ్‌ను పరిశీలించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. తొలుత ట్రస్ట్‌ పతాకాన్ని ఆవిష్కరించిన భువనేశ్వరికి ఘనంగా స్వాగతం పలికారు. అలాగే, ఎన్నారై బొబ్బా గోవర్ధన్‌, టీడీపీ నాయకుడు కనపర్తి శ్రీనివాసరావు. స్థానిక నేతలు.. భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం చల్లపల్లి ఎన్టీఆర్‌ పార్కులో నూతనంగా ఏర్పాటుచేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్‌కు పవన్ అభినందనలు

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 28 , 2025 | 06:31 AM