Political Rally : నెల్లూరులో సీపీఎం రాష్ట్ర మహాసభలు
ABN , Publish Date - Jan 25 , 2025 | 05:16 AM
నెల్లూరులో సీపీఎం 27వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం నగరంలోని వీఆర్‌సీ క్రీడా మైదానంలో డప్పు వాయించి మహాసభల నిర్వహణకు....

1 నుంచి మూడు రోజులు నిర్వహణ
నెల్లూరు వైద్యం, జనవరి 24(ఆంధ్రజ్యోతి): వచ్చే నెల 1 నుంచి మూడు రోజులపాటు నెల్లూరులో సీపీఎం 27వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం నగరంలోని వీఆర్‌సీ క్రీడా మైదానంలో డప్పు వాయించి మహాసభల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఎరుపు రంగు చొక్కాలు ధరించిన వలంటీర్ల దండు నగరంలోని ప్రధాన కేంద్రాలగుండా ప్రదర్శనగా సాగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, అనేక ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిన సింహపురి గడ్డపై నుంచే భవిష్యత్తు పోరాటాలకు మహాసభలలో రూపకల్పన చేస్తామన్నారు. రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభల ముగింపు రోజు 3వ తేదీన నగరంలో భారీ ప్రదర్శన, వీఆర్‌సీ మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో నేతలు రమాదేవి, మూలం రమేశ్, షేక్ మస్తాన్‌బీ పాల్గొన్నారు.