Share News

CI Corruption: సీఐ భుజంగరావు అవినీతిపై ఏబీఎన్ చేతిలో కీలక ఆధారాలు..

ABN , Publish Date - Jan 28 , 2025 | 09:22 AM

నెల్లూరు జీఆర్పీ సీఐ భుజంగరావు భారీ అవినీతి, అక్రమాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేతికి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. సిబ్బంది, అధికారుల ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా విచారణ చేపట్టారు. విధులు సక్రమంగా నిర్వర్తించేలా చూడటం వల్లే తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ సీఐ భుజంగరావు సమర్ధించుకున్నాడు.

CI Corruption:  సీఐ భుజంగరావు అవినీతిపై ఏబీఎన్ చేతిలో కీలక ఆధారాలు..

నెల్లూరు: జీఆర్పీ సీఐ భుజంగరావు (GRP CI Bhujangarao) భారీ అవినీతి (Corruption), అక్రమాలపై ముమ్మర విచారణ జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan), ఉన్నాతాధికారులకు సిబ్బంది, అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో జీఆర్పీ ఎస్పీ రాహుల్ మీనా (SP Rahul Meena) నేరుగా రంగంలోకి దిగారు. భుజంగరావు అవినీతి, అక్రమాలకు సంబంధించిన కీలక ఆధారాలు ఏబీఎన్ (ABN) చేతికి చిక్కాయి. కావలిలో దొంగగా మారిన మాజీ కానిస్టేబుల్‌తో సీఐ భుజంగరావు చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. బ్యాంకు తాకట్టులో బంగారం తీసుకెళ్లేంత వరకు మౌనం... ఆపై బ్యాంకు మేనేజర్‌కు సీఐ నోటీసులు ఇచ్చేవారు.

ఈ వార్త కూడా చదవండి

గంగుల కమలాకర్ వర్సెస్ మేయర్ సునీల్ రావు


సూళ్లూరుపేటలో ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి చెందగా, సీఐ భుజంగరావు కాంట్రాక్టర్ నుంచి రూ.10 లక్షలు వసూలు చేశారు. అలాగే గూడూరులో పట్టుబడ్డ 12 కిలోల గంజాయిని, స్థానిక గంజాయి వ్యాపారికి అమ్మి.. ఆపై ఆ వ్యాపారి నుంచి నెలవారీ మామూళ్లు తీసుకునేవారు... గూడూరులో నలుగురు ట్రాన్స్ జెండర్ల నుంచి ప్రతి నెలా రూ. 40 వేలు వసూలు చేసేవారు. ఉపయోగంలో లేని వాహానాల పేరుతో ఆయిల్ బిల్లులు స్వాహా.. ఇలా ఒకటేమిటి భుజంగరావుపై చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి.


పడుగుపాడు ప్రాంతంలో వ్యక్తి హత్య ఘటనని ఆత్మహత్యగా చిత్రీకరించి.. ఆత్మహత్యగా కేసు నమోదు చేయాలని మహిళా ఎస్ఐ, సిబ్బందిపై సీఐ భుజంగరావు బెదిరింపులకు దిగాడు. మహిళా అధికారులు, సిబ్బందిని లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. దిగువస్థాయి అధికారులు, సిబ్బందికి పెద్ద సంఖ్యలో మెమోలు ఇచ్చి అవి రూపుమాపడానికి నగదు వసూళ్లు చేసేవాడు. మృతదేహాల తరలింపులో కూడా అవినీతికి పాల్పడ్డాడు. ఒక్కో మృతదేహానికి రూ.5 వేలు చొప్పున ప్రభుత్వం ఇచ్చే నిధులూ స్వాహా చేసేవాడు. ఆత్మహత్య ఘటనలను ప్రమాదాలు, రైళ్లలో నుంచి జారిపడ్డట్టు చిత్రీకరించి భారీ మొత్తాల్లో డబ్బులు తీసుకునేవాడు. బిల్లులు లేకుండా బంగారం, వెండిని రైళ్లలో రవాణా చేసే వ్యాపారులకు సీఐ మద్దతిచ్చేవాడు. దిగువస్థాయి అధికారులు పట్టుకున్నా.. వారిని వదిలేయాలని పలుమార్లు ఆదేశాలు జారీ చేసేవాడు.జీఆర్పీ ఉన్నతాధికారి ఒకరు తన సమీప బంధువంటూ హంగామా చేశాడు. దీనికి సంబంధింది ఏబీఎన్‌కు వివరణ ఇచ్చేందుకు సిఐ భుజంగరావు నిరాకరించాడు. విధులు సక్రమంగా నిర్వర్తించేలా చూడటం వల్లే తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ సీఐ భుజంగరావు సమర్ధించుకున్నాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

తులసిబాబుకు సునీల్ కుమార్‌తో ఉన్న సంబంధాలపై పోలీసుల ఆరా

ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూల్‌ను సందర్శించిన భువనేశ్వరి

బాబు కష్టాన్ని దావోస్‌లో ప్రత్యక్షంగా చూశా

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 28 , 2025 | 09:23 AM