Kotamreddy Sridhar Reddy: ఆంధ్రజ్యోతి కథనంపై నెల్లూరు ఎమ్మెల్యే ఏమన్నారంటే..
ABN , Publish Date - Jan 28 , 2025 | 12:15 PM
Kotamreddy Sridhar Reddy: ‘‘నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చా. విద్యార్ధి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నా. ప్రజల ఆధరణని మరువలేను. సౌత్ మోపూరు, ములుమూడి నాకు రెండు కళ్లు. పార్టీలకంటే నాకు సొంతంగా ఓట్లు ఎక్కువ. సౌత్ మోపూరు అంటే నాకు చాలా అభిమానం. ఇక్కడి ప్రజలు అగ్గిపెట్టె నుంచి అణుబాంబు వరకు, గ్రామం నుంచి ప్రపంచం వరకు ఏదైనా చెప్పగలరు‘‘ అంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు.

నెల్లూరు, జనవరి 28: ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి (ABN-Andhrajyothy) నిర్వహిస్తున్న అక్షరం అండగా - పరిష్కారమే అజెండాగా కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ఆంధ్రజ్యోతిలో సౌత్ మోపూరు గ్రామ సమస్యలపై కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. సౌత్ మోపూరు గ్రామానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotam Reddy Sridhar Reddy), టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి (TDP Leader Kotamreddy Giridhar Reddy), ప్రభుత్వ అధికారులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా గ్రామంలో సమస్యలను ఎమ్మెల్యే కోటంరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు అక్కడి ప్రజలు. స్మశానవాటికకు ప్రహారీ నిర్మించాలని... స్కూల్ ప్రహరిగోడ కొంత మేర కూలిపోయిందని.. శ్లాబ్ పెచ్చులూడిపోతుందని తెలిపారు. తమ గ్రామానికి హెల్పర్ లేరని.. వీధి దీపాలు సక్రమంగా వెలగడం లేదన్నారు.
ట్రాన్స్ ఫార్మర్ సరిలేక పశువులు చనిపోయాయని చెప్పారు. గ్రామంలో పలుచోట్ల వర్షపు నీరు నిలుస్తుందని.. దీని కారణంగా దోమల సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఇప్పటికే విషజ్వరాలతో కొందరు మృత్యువాతపడ్డారని తెలిపారు. పొలాల్లోకి వెళ్లే రోడ్డులో గుంతల వల్ల వర్షాకాలం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. వ్యూవర్స్ కాలనీలో డ్రైనేజీ కాలువలు సరిలేవని ఎమ్మెల్యే ముందు గ్రామస్థలు తమ సమస్యలను ఏకరువుపెట్టారు.
బామ్మ ప్రేమాయణం.. యువకుడితో పరార్..
ఇది అభినందనీయం: టీడీపీ ఎమ్మెల్యే
దీనిపై టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్న అక్షరం అండగా - పరిష్కారమే అజెండా కార్యక్రమం అభినందనీయమని కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాలకు నిధులు కేటాయించలేదని... సమస్యలన్నీ పేరుకుపోయాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. ఏడు గ్రామాల్లో గడప గడపకు కార్యక్రమం నిర్వహిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్యే తెలిపారు.
పదంటే పది రోజుల్లోనే: కోటంరెడ్డి
ఆంధ్రజ్యోతి ఇదొక కొత్త అధ్యాయం అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాన్ని గద్దె దించడంలో ఏబీఎన్, ఆంధ్రజ్యోతి కీలకంగా వ్యవహారించాయనేది ప్రపంచమంతటి మాటన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా, ప్రజా సమస్యలపై పోరాడటం సంతోషకరమన్నారు. ‘‘నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చా. విద్యార్ధి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నా. ప్రజల ఆధరణని మరువలేను. సౌత్ మోపూరు, ములుమూడి నాకు రెండు కళ్లు. పార్టీలకంటే నాకు సొంతంగా ఓట్లు ఎక్కువ. సౌత్ మోపూరు అంటే నాకు చాలా అభిమానం. ఇక్కడి ప్రజలు అగ్గిపెట్టె నుంచి అణుబాంబు వరకు, గ్రామం నుంచి ప్రపంచం వరకు ఏదైనా చెప్పగలరు. 13 ఏళ్ల పసిపిల్లవాడు కూడా నాకు ఫోన్ చేసి క్రికెట్ బ్యాట్, బాల్ కావాలని అడుగుతున్నారు’’ అని తెలిపారు.
సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. సమస్యల కోసం ముందుగా రూ.కోటి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. వచ్చే నెల 8వ తేది లోపు... పదంటే పది రోజుల్లో శంకుస్థాపనలు జరుగుతాయన్నారు. ఎప్పటిలోగా పూర్తి అవుతాయో కూడా ముందుగానే చెబుతానని.. వీలైనంత త్వరగా పూర్తి చేస్తానని మాట ఇస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు - తాడిపర్తి రోడ్డు ఎంత ఘోరంగా ఉండేదో అందరికీ తెలుసన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆ రోడ్డు పనులు త్వరలో పూర్తి కాబోతున్నాయన్నారు. విద్యుత్తు సమస్యలన్నీ వెంటనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
TDP on Tulasibabu: ఆ ఆరోపణల్లో నిజం లేదు.. తులసిబాబు వ్యవహారంపై టీడీపీ
Read Latest AP News And Telugu News