Share News

Venkaiah Naidu.. కుంభమేళాలో జరుగుతున్న తీరు ఓ ప్రపంచ చరిత్ర: వెంకయ్య నాయుడు

ABN , Publish Date - Feb 14 , 2025 | 11:45 AM

ప్రయోగ్‌రాజ్ కుంభమేళాలో జరుగుతున్న తీరును మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రపంచ చరిత్రగా అభివర్ణించారు. 45 కోట్ల మంది కుంభమేళలో పవిత్ర స్నానం చేయడం ఒక్క భారతదేశంలోనే జరుగుతుందన్నారు. మారుతున్న తరానికి అనుగుణంగా యువతలో మార్పురావాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.

Venkaiah Naidu.. కుంభమేళాలో జరుగుతున్న తీరు ఓ ప్రపంచ చరిత్ర: వెంకయ్య నాయుడు
Venkaiah Naidu..

నెల్లూరు: భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు (Former Vice President Venkaiah Naidu) శుక్రవారం నెల్లూరు జిల్లా, వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌ (Swarna Bharat Trust)లో వృత్తి విద్యా శిక్షకులతో ముఖాముఖి కార్యక్రమం (Face-to-Face Program)నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుంభమేళా (Kumbh Mela)లో జరుగుతున్న తీరు ఓ ప్రపంచ చరిత్రగా అభివర్ణించారు. 45 కోట్ల మంది కుంభమేళలో పవిత్ర స్నానం చేయడం ఒక్క భారతదేశంలోనే జరుగుతుందన్నారు. విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని.. అలాగే తెలుగు సంస్కారం అలవార్చుకోవాలని సూచించారు. మారుతున్న తరానికి అనుగుణంగా యువతలో మార్పురావాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.

ఈ వార్త కూడా చదవండి..

ఏపీలో డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్


కాగా తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని కొత్తపల్లి శ్రీరాములు కనకమ్మ లయన్ ఆడిటోరియంలో ఇమ్మణి వెంకట్, దీపల కుమారుడు, తన మనువడు విష్ణు వివాహ రిసెప్షన్ వేడుకల్లో వెంకయ్య నాయుడు తన సతీమణి ఉషతో కలిసి పాల్గొన్నారు. ఇందుకోసం ఆయన విశాఖపట్టణం నుంచి రాజమండ్రికి వందే భారత్ రైలులో చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నిడదవోలుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన వియ్యంకుడు విష్ణురావు స్వగ్రామ నిడదవోలు కావడంతో వివాహ రిసెప్షన్‌ను అక్కడ నిర్వహించారన్నారు. ప్రస్తుతం తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను భవిష్యత్‌లోనూ కొనసాగిస్తామని తెలిపారు. ప్రస్తుతం తాను రాజకీయాల్లో లేనని, అలాగే, తమ కుటుంబ సభ్యులు ఎవరూ రాజకీయాల్లోకి రారని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. నేటి పరిస్థితుల్లో తమ కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రావాలని తాను కోరుకోవడం లేదని అన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యను మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, బొలిశెట్టి శ్రీనివాస్‌, ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, జి.శ్రీనివాస్‌ నాయుడు, పలువురు జిల్లా ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ హార్డ్ డిస్క్‌లో 300లకు పైగా నగ్న వీడియోలు..

సంజీవయ్య జీవిత ప్రస్థానం స్ఫూర్తిదాయకం

వల్లభనేని వంశీ నొటోరియస్‌ క్రిమినల్‌

బర్డ్ ఫ్లూ.. 5 వేల 500 కోళ్లు మృతి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 14 , 2025 | 11:45 AM