Jagan Residence : జగన్ ఇంటి వద్ద మంటల ఘటన..
ABN , Publish Date - Feb 10 , 2025 | 05:34 AM
సీఎం జగన్ ఇంటి ఎదుట ఎండిన గ్రీనరీ తగలబడిన ఘటనలో పోలీసులకు వైసీపీ కార్యాలయ ప్రతినిధుల నుంచి ఆదివారం వరకు సీసీటీవీ ఫుటేజ్ అందలేదు.

సీసీటీవీ ఫుటేజ్ అందించని వైసీపీ
తాడేపల్లి టౌన్, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ ఇంటి ఎదుట ఎండిన గ్రీనరీ తగలబడిన ఘటనలో పోలీసులకు వైసీపీ కార్యాలయ ప్రతినిధుల నుంచి ఆదివారం వరకు సీసీటీవీ ఫుటేజ్ అందలేదు. ఈ నెల 5న ఘటన జరగ్గా.. 6న సోషల్ మీడియా సహా వైసీపీ అనుకూల ప్రసారమాధ్యమాల్లో మాజీ సీఎం ఇంటి వద్ద భద్రతా లోపం అంటూ వార్తలు హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి ఫిర్యాదు మేరకు 7న తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలని ఫిర్యాదుదారుడికి తెలిపి, వైసీపీ కార్యాలయానికి నోటీసులు అందించారు. అదేరోజు ఫోరెన్సిక్ బృందం, గుంటూరు జిల్లా క్లూస్ టీమ్.. ఘటన జరిగిన ప్రాంతంలో ఆధారాలు సేకరించి ల్యాబ్‌కు పంపింది. సీసీ టీవీ ఫుటేజ్ విషయమై నోటీసులు ఇచ్చి రెండు రోజులు గడిచినా వైసీపీ నాయకులు స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి