Palla Srinivasa Rao: వైసీపీకి ప్రతిపక్ష హోదాను ప్రజలే తిరస్కరించారు
ABN , Publish Date - Feb 28 , 2025 | 04:20 AM
ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పిన మాజీ సీఎం జగన్, కేవలం పది నిమిషాలపాటు అసెంబ్లీలో డ్రామా ఆడి వెళ్లిపోయారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు.

ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననడం సిగ్గుచేటు: పల్లా
గాజువాక, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పిన మాజీ సీఎం జగన్, కేవలం పది నిమిషాలపాటు అసెంబ్లీలో డ్రామా ఆడి వెళ్లిపోయారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. గాజువాకలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేతకు, రాజకీయ పక్ష నేతకు కేవలం ప్రొటోకాల్, విమాన టికెట్లలో మాత్రమే తేడా ఉంటుందని, మిగిలినవన్నీ సమానమేనన్నారు. ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా తిరస్కరించారని వ్యాఖ్యానించారు. తప్పు చేస్తే ప్రశ్నించాలే తప్ప, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్షం ఉన్నా లేకున్నా అసెంబ్లీని సద్వినియోగం చేసుకొని ప్రజలకు మంచి జరిగేలా చూస్తామని చెప్పారు. ప్రసాదుల శ్రీనివాస్, కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.