Custodial Torture Case: తులసిబాబుకు సునీల్ కుమార్‌తో ఉన్న సంబంధాలపై పోలీసుల ఆరా
ABN , Publish Date - Jan 28 , 2025 | 07:22 AM
రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు తులసిబాబును ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ సోమవారం రాత్రి విచారించారు. ప్రధానంగా మాజీ సీఐడి చీఫ్ సునీల్ కుమార్‌తో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. అయితే సమయం ఎక్కవగా లేకపోవడంతో గంటన్నర మాత్రమే విచారించారు. తిరిగి మంగళవారం ఉదయం విచారణ కొనసాగనుంది.

ప్రకాశం జిల్లా: నరసాపురం మాజీ ఎంపీ (Narasapuram Ex MP), ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు (Deputy Speaker Raghurama Krishna Raju) పై కస్టోడియల్ టార్చర్ కేసు (Custodial Torture Case)లో కామేపల్లి తులసి బాబు (Kamepalli Tulasibabu,)ని రెండో రోజు మంగళవారం ఎస్పీ దామోదర్ (SP Damodar) విచారించనున్నారు. కేసు విచారణలో భాగంగా మొదటి రోజు సోమవారం పోలీసులు గుంటూరు జైలు నుంచి తులసిబాబుని ఒంగోలు తీసుకు వచ్చారు. రాత్రి 8 గంటల నుండి 9.30 గంటల వరకు విచారించారు. రఘురామపై కస్టోడియల్ టార్చర్‌తో పాటు మాజీ సీఐడి చీఫ్ సునీల్ కుమార్‌తో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. ఈరోజు ఉదయం 10 గంటల నుండి తులసిబాబును విచారించనున్నారు.
కాగా రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తులసిబాబును మూడు రోజులపాటు పోలీసు కస్టడీకి గుంటూరు జిల్లా కోర్టు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ప్రకాశం జిల్లా పోలీసులు జైల్లో ఉన్న తులసి బాబును అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. అతనికి బీపీ హెచ్చు తగ్గులు ఉండటంతో ఆస్పత్రిలోనే వైద్యం అందించారు. దాదాపు ఐదు గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో తులసిబాబు ఉన్నాడు. ఏకో, ఇతర పరీక్షలు నిర్వహించిన అనంతరం తులసిబాబును ఒంగోలుకు తరలించారు. సమయం ఎక్కువగా లేకపోవడంతో సోమవారం రాత్రి 8 గంటల నుండి 9.30 గంటల వరకు విచారించారు. తిరిగి ఈరోజు 10 గంటలకు తులసిబాబును విచారించనున్నారు. ఒంగోలులో ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో తులసిబాబు విచారణ కొనసాగుతోంది.
ఈ వార్త కూడా చదవండి..
ఎన్టీఆర్ మోడల్ స్కూల్‌ను సందర్శించిన భువనేశ్వరి
కాగా.. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రైవేటు వ్యక్తి అయిన తులసిబాబును ఈనెల 8వ తేదీ సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు విచారణ జరిపిన పోలీసులు ఆపై అరెస్ట్ చేశారు. ఈ కేసులో పోలీసు కస్టడీలో ఉన్న రిటైర్డ్ ఏఎస్పీ విజయ్‌పాల్‌ను తులసి బాబును ఒకే చోట కూర్చోబెట్టి ప్రశ్నలు సంధించారు. అనంతరం విజయ్‌పాల్‌ను పంపించి వేసి తులసి బాబును ప్రత్యేకంగా విచారించారు. ఈ క్రమంలో కొంత మేర సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. అయితే పోలీసుల విచారణకు సహకరించకపోవడంతో పాటు బలమైన ఆధారాలు ఉండటంతో తులసిబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బాబు కష్టాన్ని దావోస్‌లో ప్రత్యక్షంగా చూశా
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News