Nellore : కృష్ణపట్నంలో అనిల్ అంబానీ పర్యటన
ABN , Publish Date - Jan 24 , 2025 | 04:00 AM
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ గురువారం నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో తమ సంస్థకు గతంలో కేటాయించిన భూములను సందర్శించారు.

రిలయన్స్ గ్రూప్ భూముల పరిశీలన
పరిశ్రమల ఏర్పాటుకేనని అంచనా
నెల్లూరు, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ గురువారం నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో తమ సంస్థకు గతంలో కేటాయించిన భూములను సందర్శించారు. ఆయనతో పాటు జేసీ కార్తీక్, ముత్తుకూరు మండల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. భూముల సందర్శన అనంతరం అనిల్ అంబానీ, రిలయన్స్ అధికారులతో పరిశ్రమల స్థాపనపై చర్చలు జరిపారని తెలిసింది. కృష్ణపట్నంలో 3,200 మెగావాట్ల సామర్థ్యంతో అలా్ట్ర మెగా థర్మల్ విద్యుత్ కేంద్రం స్థాపన కోసం 2006లో ప్రభుత్వం 2,600 ఎకరాల భూమిని రిలయన్స్ అనుబంధ సంస్థ కోస్టల్ ఆంధ్ర పవర్ లిమిటెడ్‌కు కేటాయించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు ధర పెరిగిందనే కారణంతో పరిశ్రమ స్థాపనకు బ్రేక్ పడింది. 2019లో ఈ భూములను విక్రయించేందుకు రిలయన్స్ సంస్థ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. దీంతో ఆ భూములను వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం రిలయన్స్ సంస్థకు నోటీసులిచ్చింది. వివాదం న్యాయస్థానానికి చేరింది. భూములను పరిశ్రమల స్థాపనకే ఉపయోగిస్తామని రిలయన్స్ కోర్టుకు విన్నవించడంతో భూములను ఆ సంస్థ పరిధిలో ఉంచడానికి 2019లో అంగీకారం కుదిరింది.
పరిశ్రమల కోసమే అనిల్ రాక!
కూటమి ప్రభుత్వ ఒత్తిడి మేరకు అనిల్ అంబానీ సంస్థ పరిశ్రమల స్థాపనకు సిద్ధమయ్యిందని తెలుస్తోంది. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా లేదా సోలార్ విద్యుత్ పరికరాల తయారీ పరిశ్రమలు స్థాపించడంపై పరిశీలిస్తున్నారని అంటున్నారు. పరిశ్రమల స్థాపనకు సంబంధించి తమకు సమాచారం లేదని జేసీ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Fog Effect: గన్నవరం ఎయిర్‌పోర్టుకు రావలసిన పలు విమానాలు ఆలస్యం
Lokesh Visit Davos: అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయండి: మంత్రి లోకేష్
Read Latest AP News And Telugu News