Share News

AP Police : మాజీ మంత్రి రజనీపై కేసు

ABN , Publish Date - Feb 08 , 2025 | 03:04 AM

వైసీపీ మాజీమంత్రి విడదల రజనీపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదైంది. ఆ

AP Police : మాజీ మంత్రి రజనీపై కేసు

చిలకలూరిపేట, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీమంత్రి విడదల రజనీపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదైంది. ఆమెకు పీఏలుగా పనిచేసిన ఎన్‌.జయ ఫణీంద్ర, రామకృష్ణ, అప్పటి చిలకలూరిపేట అర్బన్‌ సీఐ వి.సూర్యనారాయణపై కూడా కేసు నమోదైంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన టీడీపీ దళిత నాయకుడు పిల్లి కోటి 2019లో పార్టీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జి హోదాలో సోషల్‌మీడియాలో రజిని చట్ట వ్యతిరేక వ్యవహారాలకు సంబంధించి పోస్టులు పెట్టారు. అందుకు కోటిని ఐదు రోజులు పాటు చిలకలూరిపేట అర్బన్‌ పోలీస్‌ ేస్టషన్‌లో చిత్రహింసలకు గురి చేశారు. నాటి ఘటనపై పోలీసులకు ఆయన తాజాగా ఫిర్యాదు చేశారు.

Updated Date - Feb 08 , 2025 | 03:04 AM