Share News

Fertilizer Plant : భారీ పెట్టుబడులకు ఎస్‌ఐపీసీ ఆమోదం

ABN , Publish Date - Jan 12 , 2025 | 06:27 AM

రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ(ఎ్‌సఐపీసీ) ఆమోదం తెలిపింది.

Fertilizer Plant : భారీ పెట్టుబడులకు ఎస్‌ఐపీసీ ఆమోదం

  • కాకినాడలో సీఐఎల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సమ్మతి

అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ(ఎ్‌సఐపీసీ) ఆమోదం తెలిపింది. సీఎస్‌ కె.విజయానంద్‌ అధ్యక్షతన సచివాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో పలు పెట్టుబడులకు సమ్మతించింది. ఆమోదం పొందిన ప్రాజెక్టులు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్‌ఐపీబీ) ఆమోదం తో పాటు మంత్రిమండలి సమ్మతి పొందుతాయి. కాకినాడలో రూ.1,539 కోట్ల పెట్టుబడులతో ఇంటిగ్రేటెడ్‌ పాస్ఫెటిక్‌ ఫెర్టిలైజర్‌ ప్లాంట్‌, మరో రూ.1,700 కోట్లతో అనుబంధ ప్లాంట్ల ఏర్పాటుకు కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌(సీఐఎల్‌) పంపిన ప్రతిపాదనలకు ఎస్‌ఐపీసీ ఆమోదం తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో 2017లో కేటాయించిన భూముల్లో న్యాయపరమైన సమస్యలు ఉన్నందున అనకాపల్లిలోని కోడూరులో ఏపీఐఐసీ భూములు కేటాయించాలని మెస్సర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ ఆఫ్‌ ఇండియా(గతంలో ఎలీప్‌) చేసిన ప్రతిపాదనను ఏస్‌ఐపీసీ ఆమోదించింది. కడప జిల్లా కొప్పర్తి ఎలకా్ట్రనిక్‌ మా న్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌(ఈఎంసీ)లో రూ.748. 76 కోట్లతో 540 ఎకరాల్లో చేపట్టే ప్రాజెక్టుకు ఇప్పటిదాకా ధర నిర్ధారణ కాలేదు. ఈ క్లస్టర్‌లో కేటాయించిన స్థలాలకు స్టాంప్‌ డ్యూటీ మినహాయించాలన్న వినతికి ఆమో దం లభించింది. చిత్తూరు జిల్లా మురుకంబట్టులో అపోలో హాస్పిటల్స్‌కు 8.17 ఎకరా లు కేటాయింపునకు సమ్మతించింది. ప్రాజె క్టు సిక్స్‌టీన్‌ రెన్యువబల్‌ పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 194.70 మెగావాట్లు, సెవెన్‌ రెన్యువబుల్‌ పవర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ 148.50 మెగావాట్లు, ప్రాజెక్టు ఎలెవన్‌ రెన్యువబుల్‌ పవర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ 102.30 మెగావాట్లు, అయన రెన్యువబుల్‌ పవర్‌ ఫోర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ 52.80 మెగావాట్ల ప్రాజెక్టులకు ఎస్‌ఐపీసీ ఆమోదం తెలిపింది.

Updated Date - Jan 12 , 2025 | 06:27 AM