Electricity Issues : విద్యుత్ సమస్య పరిష్కారానికి అడుగులు
ABN , Publish Date - Feb 09 , 2025 | 04:54 AM
ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం ఫలితాలు ప్రజలకు ఒక్కొక్కటిగా అందుతున్నాయి.

స్తంభాలు, లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు వ్యయ అంచనా పూర్తి.. త్వరలో పనులు
శ్రీసత్యసాయి జిల్లాలో ఫలితమిస్తున్న ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’
కొత్తచెరువు, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు బీసీ కాలనీలో ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం ఫలితాలు ప్రజలకు ఒక్కొక్కటిగా అందుతున్నాయి. జనవరి 28న నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలు అనేక సమస్యలను వారి దృష్టికి తీసుకురాగా.. వాటిల్లో డ్రైనేజీ సమస్య ఇప్పటికే పరిష్కారమైంది. తాజాగా విద్యుత్ సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. బీసీ కాలనీ, ఎన్టీఆర్ నగర్, వేణుగోపాల్ నగర్‌లోని ఎల్-1 ,2 ,3 ,4 ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు వ్యయ అంచనాలు రూపొందించారు. కాలనీల్లో రెండ్రోజులు పర్యటించి ఎన్ని స్తంభాలు అవసరమో, ఎంత ఖర్చు అవుతుందో గుర్తించారు. నివేదికను ఎమ్మెల్యేకు అందజేస్తామని, డీడీలు చెల్లించగానే పని పూర్తి చేస్తామని ట్రాన్స్‌కో ఏఈ వెంకటేశ్ నాయక్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..
Betting Apps: బెట్టింగ్ యాప్స్ భూతానికి మరో యువకుడు బలి..