Share News

Prakasam District: రఘురామ టార్చర్‌ కేసులో.. ఐజీ సునీల్‌ నాయక్‌కు నోటీసులు

ABN , Publish Date - Mar 03 , 2025 | 03:04 AM

రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో విచారణకు రావాలని ప్రస్తుతం బిహార్‌ ఫైర్‌ సర్వీసెస్‌ ఐజీగా పనిచేస్తున్న సునీల్‌ నాయక్‌కు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్‌ నోటీసులు.

 Prakasam District: రఘురామ టార్చర్‌ కేసులో.. ఐజీ సునీల్‌ నాయక్‌కు నోటీసులు

  • నేడు విచారణకు ఒంగోలు రావాలని సూచన

ఒంగోలు క్రైం, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): డిప్యూ టీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో విచారణకు రావాలని ప్రస్తుతం బిహార్‌ ఫైర్‌ సర్వీసెస్‌ ఐజీగా పనిచేస్తున్న సునీల్‌ నాయక్‌కు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్‌ నోటీసులు జారీ చేశారు. 4రోజుల క్రితం వాట్సాప్‌, ఫ్యాక్స్‌ ద్వారా వీటిని పంపారు. సోమవారం ఒంగోలులో జిల్లా ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కోరారు. బిహార్‌ కేడ ర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన సునీల్‌ నాయక్‌ వైసీపీ హయాంలో డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చారు. సీఐడీలో డీఐజీగా పనిచేశారు. అప్పట్లో రఘురామను సీఐడీ అధికారులు అరెస్టు చేసి గుంటూరులోని ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. ఆ సమయంలో సునీల్‌ నాయక్‌ అక్కడకు వచ్చారని ఈ కేసును ఎస్పీ దామోదర్‌ నిర్ధారణకు వచ్చారు. దీంతో విచారణకు పిలిచారు.

Updated Date - Mar 03 , 2025 | 03:04 AM