Public Grievances : భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Feb 09 , 2025 | 05:01 AM
కబ్జాదారుల దందాలతో భూ సమస్యలు ఎదుర్కొంటున్న అనేక మంది బాధితులు న్యాయం కోసం టీడీపీ నేతలకు మొరపెట్టుకున్నారు.

పార్టీ మారాలంటూ ఎస్సై జులుం... లక్ష వసూలు
మా డబ్బులు మాకు ఇప్పించి న్యాయం చేయండి
టీడీపీ గ్రీవెన్స్‌లో బాధితుల విజ్ఞప్తి
అమరావతి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ విధానాలతో, వైసీపీ కబ్జాదారుల దందాలతో భూ సమస్యలు ఎదుర్కొంటున్న అనేక మంది బాధితులు న్యాయం కోసం టీడీపీ నేతలకు మొరపెట్టుకున్నారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ‘వంగా శ్రీహరి గతంలో వెల్దుర్తి ఎస్సైగా ఉన్నపుడు పార్టీ మారాలంటూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. రూ.లక్ష తీసుకున్నాడు. అతనిపై విచారణ జరిపించాలి. మా సొమ్ము మాకు ఇప్పించాలి’ అని పల్నాడు జిల్లా గుండ్లపాడుకు చెందిన తోట ఆంజనేయులు కోరారు. తమ ప్రాంతంలో మహిళా జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయాలని చిత్తూరు జిల్లా రాయలపేటకు చెందిన కే చంద్రయ్య విజ్ఞప్తి చేశారు.