Share News

TDP Leaders: వైఎస్ జగన్‌పై మండిపడ్డ టీడీపీ నేతలు

ABN , Publish Date - Feb 18 , 2025 | 03:30 PM

TDP Leaders: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేతలు మండిపడ్డారు. జైలులో ఉన్న వంశీని వైఎస్ జగన్ పరామర్శించడంతోపాటు బయట మీడియాతో మాట్లాడుతూ.. చేసిన వ్యాఖ్యలపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో జగన్ తల్లిని, చెల్లి పుట్టుకపై విమర్శలు చేసిన వర్రా రవీంద్ర రెడ్డి సైతం జైలులో ఉన్నాడని.. వెళ్లి అతన్ని కూడా పరామర్శిస్తావా ? అంటూ వైఎస్ జగన్‌ను సూటిగా ప్రశ్నించారు.

TDP Leaders: వైఎస్ జగన్‌పై మండిపడ్డ టీడీపీ నేతలు

అమరావతి, ఫిబ్రవరి 18: పలు కేసులు నమోదు నేపథ్యంలో విజయవాడ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో వైఎస్ జగన్‌పై టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. మంగళవారం అమరావతిలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో ఎంతో మంది నాయకుల్ని, ముఖ్యమంత్రులను చూశామని.. కానీ వైఎస్ జగన్ లాంటి దుర్మార్గపు ఆలోచనలు ఉన్న వ్యక్తిని మాత్రం ఇంత వరకు చూడ లేదని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.

జగన్మోహన్ రెడ్డి మాటలను అతను సొంత పార్టీ వారే సమర్ధించడం లేదన్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి జైలు వద్దకు వెళ్లి వార్నింగ్ ఇస్తాడా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దుర్మార్గుడ్ని పరామర్శించడానికి జైలుకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి కులాల గురించి మాట్లాడతాడా? అని ప్రశ్నించారు. మనిషి అనే వాడు చేయని దుర్మార్గాలు వంశీ చేస్తే.. వెళ్లి ఆయన్ని పరామర్శించాడన్నారు. జగన్ తల్లిని, చెల్లి పుట్టుకపై విమర్శలు చేసిన వర్రా రవీంద్ర రెడ్డి సైతం జైలులో ఉన్నాడని.. వెళ్లి అతన్ని కూడా పరామర్శిస్తావా ? అంటూ వైఎస్ జగన్‌కు సోమిరెడ్డి సూటిగా ప్రశ్నలు సంధించారు.


రిజిస్ట్రేషన్లు, స్టాంపులు, రెవెన్యూ శాఖల మంత్రి అనగాని సత్య ప్రసాద్ మాట్లాడుతూ.. ఎవరు చనిపోయినా తన తండ్రి కోసమే చనిపోయినట్లు గతంలో ఓదార్పు యాత్ర చేసిన వైఎస్ జగన్... ప్రస్తుతం జైలు యాత్రలు చేపట్టాడని వ్యంగ్యంగా పేర్కొ్న్నారు. పాత జైలు పక్షి మళ్లీ జైలుకెళ్లి రౌడీలు, గూండాలకు వత్తాసు పలుకుతున్నాడంటూ ఎద్దేవా చేశారు.

Also Read: జగన్ రెడ్డి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు


కొండలు, గుట్టలు, దౌర్జన్యాలు వంశీ చేస్తే..., ఏదో వీర పోరాటం చేసిన వాడిని జైల్లో పెట్టినట్లుగా వైఎస్ జగన్ మాటలున్నాయన్నారు. గన్నవరంలో వంశీ పార్టీ మారాక చేసిన అరాచకాలు చూసి... అతడికి ఎందుకు ఓటు వేశామా? అని నియోజకవర్గ ప్రజలు బాధపడ్డారని మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. జగన్ అరాచకాలపై గత ఎనిమిది నెలలుగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని ఆక్ష్న పేర్కొ్న్నారు. తమకు వచ్చే గ్రీవెన్స్‌లు చూసైనా ఎన్ని పాపాలు చేశాడో గ్రహించి.. బుద్ధి తెచ్చుకోవాలని వైఎస్ జగన్‌కు మంత్రి అనగాని సత్య ప్రసాద్ హితవు పలికారు.


గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడితోపాటు ఎస్సీ,ఎస్టీ ఎట్రాసిటి కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టయ్యారు. అనంతరం ఆయన్ని విజయవాడలోని జైలులో ఉంచారు. ఈ నేపథ్యంలో జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మంగళవారం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం జైలు వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వంశీని పరామర్శించడంతోపాటు వ్యాఖ్యలు చేయడంపై సర్వత్ర విమర్శలు వెలువెత్తుతోన్నాయి. ఈ దాంతో ఇప్పటికే టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సైతం వైఎస్ జగన్‌కు పలు ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖను సంధించారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 18 , 2025 | 03:31 PM