-
-
Home » Andhra Pradesh » Today Breaking News Pongal Festival Maha Kumbh 2025 and Latest Telugu News Updates Thuesday 14th january 2024 Amar
-
Breaking News: మరికాసేపట్లో మకర జ్యోతి దర్శనం.. లైవ్ ఇక్కడ చూడండి..
ABN , First Publish Date - Jan 14 , 2025 | 10:08 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
2025-01-14T17:49:45+05:30
మరికాసేపట్లో మకర జ్యోతి దర్శనం..
పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో మకరజ్యోతి రూపంలో దర్శనం ఇవ్వనున్న అయ్యప్ప.
మకరజ్యోతి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్న అయ్యప్పస్వామి.
మకరజ్యోతి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు
అయ్యప్ప శరణుఘోషతో మార్మోగుతున్న శబరిగిరులు.
-
2025-01-14T13:41:35+05:30
చైనా మంజా తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలు..
నిజామాబాద్ జిల్లాలో సంక్రాంతి వేడుకల్లో అపశృతి
నవీపేట్ మండల కేంద్రంలో బైక్ పై వెళ్తున్న అద్నాన్ అనే యువకుడికి తగిలిన చైనా మాంజ
గొంతు, చేతివేళ్లకు తీవ్రగాయాలు
చికిత్స కోసం ఆస్పత్రికి తరలింపు
-
2025-01-14T11:20:37+05:30
నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ప్రారంభం
నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం
వర్చువల్ గా జాతీయ పసుపు బోర్డు ప్రారంభించిన కేంద్ర మంత్రి పీయుష్ గోయల్
హాజరైన జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగా రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, దన్ పాల్ సూర్యనారాయణ, తరలివచ్చిన పసుపు రైతులు
-
2025-01-14T10:32:17+05:30
ఘోర ప్రమాదం
కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఘోర ప్రమాదం
అతి వేగంగా షాప్ లోకి దూసుకుపోయిన స్పోర్ట్స్ బైక్
అక్కడికక్కడే యర్ర అబ్బాయి (26) మృతి.. మరో వ్యక్తి
పండు పరిస్థితి విషమం
-
2025-01-14T10:14:12+05:30
నేడు పసుపు బోర్డు ప్రారంభం
ఇవాళ నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ప్రారంభోత్సవం
ఢిల్లీ నుంచి వర్చు వల్ గా ప్రారంభించనున్న కేంద్ర మంత్రి పియూష్ గోయల్, ఎంపీ అర్వింద్
జిల్లాలోహాజరుకానున్న జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి
కార్యక్రమంలో పాల్గొననున్న పసుపు రైతులు
-
2025-01-14T10:08:18+05:30
కౌశిక్ రెడ్డికి బిగ్ రిలీఫ్
హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్
ఎమ్మెల్యే సంజయ్‌పై దాడి కేసులో సోమవారం అరెస్ట్
మంగళవారం ఉదయం మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టిన పోలీసులు
కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి