Share News

Visakhapatnam : గురు గోవింద్‌సింగ్‌ జయంతి వేడుకల్లో పురందేశ్వరి

ABN , Publish Date - Jan 07 , 2025 | 06:55 AM

విశాఖ నగరంలోని గురుద్వార కూడలిలో గల గురుద్వార మందిరంలో సిక్కుల పదో గురువు గురు గోవింద్‌సింగ్‌ 358వ....

Visakhapatnam : గురు గోవింద్‌సింగ్‌ జయంతి వేడుకల్లో పురందేశ్వరి

  • ఖడ్గం బహూకరించిన సిక్కు పెద్దలు

సీతమ్మధార (విశాఖపట్నం), జనవరి 6 (ఆంధ్రజ్యోతి): విశాఖ నగరంలోని గురుద్వార కూడలిలో గల గురుద్వార మందిరంలో సిక్కుల పదో గురువు గురు గోవింద్‌సింగ్‌ 358వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రార్థనల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. గురుద్వార సాద్‌ సంగత్‌ అధ్యక్షుడు డాక్టర్‌ డి.ఎ్‌స.ఆనంద్‌ ఆధ్వర్యంలో సిక్కు మత పెద్దలు పురందేశ్వరికి స్వాగతం పలికి అనంతరం ఖడ్గం బహూకరించి సన్మానించారు. ప్రార్థనల్లో పాల్గొన్న స్థానిక బీజేపీ నాయకురాలు శ్యామల దీపికను కూడా సత్కరించారు.

Updated Date - Jan 07 , 2025 | 06:56 AM