Lokesh: ఏపీ డిజిటల్ టెక్నాలజీ సదస్సు.. ముఖ్యఅతిథిగా మంత్రి నారా లోకేష్
ABN , Publish Date - Jan 08 , 2025 | 11:15 AM
విశాఖ: ఏపీ డిజిటల్ టెక్నాలజీపై రాష్ట్ర స్థాయి సదస్సు బుధవారం ఉదయం విశాఖలోని వీఎంఆర్‌డీఏ చిల్రన్ ఎరీనాలో ప్రారంభమైంది. రెండు రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
విశాఖ: ఏపీ డిజిటల్ టెక్నాలజీపై రాష్ట్ర స్థాయి సదస్సు (AP Digital Technology Conference) బుధవారం ఉదయం విశాఖ (Visakha)లోని వీఎంఆర్‌డీఏ చిల్రన్ ఎరీనా (VMRDA Children's Arena)లో ప్రారంభమైంది. రెండు రోజులు నిర్వహించే ఈ సదస్సుకు ముఖ్యఅతిథి (Chief Guest)గా రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా సహకారం అందిస్తున్న ఈ సదస్సులో ఐటీ, ఐటీఈఎస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఎలక్ర్టానిక్స్, స్మార్ట్ అండ్ సస్టెయినబుల్ టెక్నాలజీ, మెడికల్ అండ్ హెల్త్ టెక్నాలజీ, క్రియేటివ్ టెక్నాలజీలపై చర్చలు జరుగుతాయని ఏపీ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ లీడర్‌షిప్ ఫోరమ్ కన్వీనర్ శ్రీధర్ కొసరాజు తెలిపారు.
విశాఖలో జనవరి 8, 9 తేదీ ల్లో ఏపీ డిజిటల్ టెక్నాలజీ సదస్సు నిర్వహించనున్నట్లు కన్వీనర్ శ్రీధర్ కొసరాజు తెలిపారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన విశాఖలో మాట్లాడుతూ ఏడు రంగాల్లో ఐటీ ఎలా అభివృద్ధి చెందుతున్నదీ, డీప్ టెక్నాలజీ ప్రాముఖ్యత, స్టార్ట్‌ప్‌లు వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చ ఉంటుందన్నారు. ఐటీ మంత్రి నారా లోకేశ్, ఎంఎస్ఎంఈల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కేంద్ర ఐటీ సెక్రటరీ వంటి ప్రముఖులు వస్తారన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చంద్రబాబు, పవన్‌పై ఎంపీ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు
కుంభమేళాకు బయలుదేరిన శ్రీవారి కళ్యాణరథం
రాజమండ్రిలో ప్రపంచ తెలుగు మహాసభలు
కేసులను న్యాయస్థానాల్లోనే ఎదుర్కొంటా: కేటీఆర్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News