Share News

Srisailam : పడిపోతున్న ప్రాజెక్టు నిల్వలు

ABN , Publish Date - Feb 04 , 2025 | 04:01 AM

శ్రీశైలం .. నాగార్జునసాగర్‌లలో నీటి నిల్వలు అడుగంటాయి. గత ఏడాది ఎగువ నుంచి భారీగా వచ్చిన వరదతో ప్రధాన జలాశయాలతోపాటు...

Srisailam : పడిపోతున్న ప్రాజెక్టు నిల్వలు

  • వేసవికి ముందే తగ్గుతున్న నీటిమట్టాలు

  • శ్రీశైలం జలాశయంలో 40 శాతం,

  • నాగార్జున సాగర్‌లో 68శాతం లోటు

  • నదుల పరివాహకంలోనూ ఇదే స్థితి

అమరావతి, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): ఇంకా వేసవి మొదలు కాకముందే రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల నీటిమట్టాలు పడిపోతున్నాయి. శ్రీశైలం .. నాగార్జునసాగర్‌లలో నీటి నిల్వలు అడుగంటాయి. గత ఏడాది ఎగువ నుంచి భారీగా వచ్చిన వరదతో ప్రధాన జలాశయాలతోపాటు చిన్న మధ్యతరహా ప్రాజెక్టులూ, చెరువులూ నిండుగా కనిపించాయి. మొత్తం 993.50 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదయింది. రాష్ట్రంలోని 108 చిన్న, మధ్య, భారీ రిజర్వాయర్లులో 623.56 టీఎంసీల నీటినిల్వలు కనిపించాయి. అలాంటిది ఈ నెల మొదటివారానికే జలాశయాల్లో పరిస్థితి తారుమారు అయింది. ఇక.. నదుల పరీవాహక ప్రాంతాల్లో 983.63 టీఎంసీలకుగాను 623.56 (63.4శాతం) నిల్వలే ఉన్నాయి. మరో 360 టీఎంసీల లోటు కనిపిస్తోంది. దీంతో రానున్న వేసవిని తట్టుకోవడం ఎట్లా అనే ఆందోళన పెరుగుతోంది. రాష్ట్రంలో ఈ ఏడాది వేసవి తీవ్రత అత్యధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా పడిపోతుండటంపై జల వనరుల శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Updated Date - Feb 04 , 2025 | 04:02 AM